/rtv/media/media_files/2025/06/24/allu-arjun-atlee-2025-06-24-10-53-02.jpg)
Allu Arjun - Atlee
అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఈ మూవీ జోష్‌లోనే ఐకాన్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Allu Arjun - Atlee:
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీకి ఓకే చెప్పేశాడు. ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన అట్లీ ఇప్పుడు బన్నీతో మరొక బిగ్గెస్ట్ హిట్ కోసం రంగంలోకి దిగాడు. వీరిద్దరి కాంబోలో ఈ సినిమా ఇటీవలే అఫీషియల్‌గా లాంచ్ అయింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే షూటింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇందులో భాగంగానే ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను ముంబైలో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇలా దాదాపు మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. దీని తర్వాత వీఎఫ్ఎక్స్ పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. దీనిపై అఫీషియల్ అప్డేట్ త్వరలో రానుంది.