Pawan Kalyan Mother: పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్ మధ్యలోనే ఆపేసిన చిరు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్‌కు తెలియడంతో ఆయన వెంటనే అక్కడ నుంచి బయల్దేరినట్లు సమాచారం. దీంతో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 

New Update
Pawan Kalyan Mother anjanadevi unwell

Pawan Kalyan Mother anjanadevi unwell

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం. ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్‌కు తెలియడంతో ఆయన వెంటనే వెంటనే అక్కడ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

Pawan Kalyan Mother

అలాగే మెగాస్టార్ చిరంజీవి.. అతడు నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ ‌నుంచి మధ్యలో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Also Read: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్‌ సెటైరికల్ ట్వీట్‌

ఇందులో భాగంగానే నిన్నటి నుంచి అంటే సోమవారం నుంచి మూడో షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. ఈ తరుణంలో తన తల్లి అనారోగ్యానికి గురైందన్న సమాచారం అందడంతో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. 

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు