USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Talibans and USA

Talibans and USA

USA and Talibans: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలోని ఓ జైల్లో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అఫ్గాన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న  ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం అరెస్టయిన అఫ్గాన్ ఫైటర్ ఖాన్‌ మహమ్మద్‌ ఇప్పుడు కాలిఫోర్నియాలోని ఓ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  

Also Read: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం

అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

అయితే అమెరికాతో తాము జరిపిన చర్చల తర్వాత ఈ సమస్య పరిష్కారమైందని తాలిబన్ అధికారులు తెలిపారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఖైదీలలో ఒకరైన ర్యాన కార్బెట్ కుటుంబం మీడియాతో మాట్లాడింది. 

'' ర్యాన్ మా నుంచి దూరమై 894 రోజులయ్యింది. ఇవి తమ జీవితంలో సవాళ్లతో కూడుకున్నవి. 2022లో మేము విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తాలిబన్లు ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చివరికీ ఇన్నేళ్లకు తిరిగి ర్యాన్‌కు తమకు అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలని''ర్యాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా తమ దేశస్థులని విడిపించేందుకు తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా గతంలో తెలిపారు. ఇటీవలే బాధిత కుటుంబ సభ్యులతో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తాలిబన్ల చెరలో ఉన్నటువంటి తమ వాళ్లని విడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుదిదశకు వచ్చాయని చెప్పారు. దీంతో అఫ్గాన్‌లో ఉంటున్న అమెరికా ఖైదీల కుటుబాలు.. తమవారి కోసం ఎదురుచూస్తున్నాయి.   

Also Read:  మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు