/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
Trump likely to sign 100 executive orders Photograph: (Trump likely to sign 100 executive orders)
Donald Trump Decision: ఏ దేశ గడ్డపై పుడితే బిడ్డకు ఆ దేశ పౌరసత్వం వస్తుంది. ఇలాంటి చట్టాలు ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. తల్లిదండ్రులు ఎక్కడి వారైనా సరే.. జన్మించిన పిల్లలకు మాత్రం అక్కడి సిటిజన్‌షిప్ వస్తోంది. ఇది 2025 జనవరి 20 వరకే నట. ట్రంప్ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే.. కొన్ని సంచలన చట్టాలు చేశారు. ఈ మేరకు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై జారీ చేశారు. అక్రమ వలసలపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. గతంలో కూడా ట్రంప్ ఇదే విధానాలు కొనసాగించారు. బర్త్ సిటిజన్‌షిన్‌ను అమెరికలో రద్దు చేయన్నట్లు ట్రంప్ కార్యనిర్వహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికా జనాభాలో 14 శాతం మొత్తం వలసదారులపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకూ 2కోట్ల 27 లక్షల 36 వేల మందికి అమెరికా ప్రభుత్వం బర్త్ సిటిజన్‌షిప్ ఇచ్చింది. అంటే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా అక్కడ పుట్టిన వారికి అమెరికన్ సిటిజన్‌గా గుర్తించింది.
Also Read: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
అమెరికా జన్మతహా పౌరసత్వం..?
తల్లిదండ్రల జన్మస్థలంతో సంబంధం లేకుండా.. వారు వలసదారులైనా సరే అమెరికాలో పుట్టిన పిల్లలకు అమెరికన్ పౌరులుగా గుర్తిస్తారు. దీన్ని అమెరికాలో 1868లో చట్టం చేశారు. అమెరికన్ రాజ్యాంగంలోని 14వ సవరణ దీని గురించి వివరింస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టినా.. పౌరసత్వం లేని వలసవాదులకు పుట్టినా సరే అమెరికాలో జన్మించిన వారు ఈ రాష్ట్ర పౌరులే అని రాజ్యాంగంలో ఉంది.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
ట్రంప్ మార్పులు ఇవే..!
జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. వాటిలో బర్త్ సిటిజన్‌షిప్‌ని రద్దు చేస్తున్న ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్డర్స్ అమలులోకి తీసుకొస్తే అమెరికాలో పుట్టిన బిడ్డకు జన్మతహా పౌరసత్వం రావాలంటే.. కచ్చితంగా తల్లిదండ్రుల్లో ఒకరోఒకరు అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండాలి. లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్, US మిలిటరీ సభ్యుడు అయి ఉండాలి. ట్రంప్ తీసుకురానున్నట్లు నిబంధనలు ఇవే. ఇదే అమలైతే.. అమెరికా వలస వచ్చి అక్కడ పిల్లలకు జన్మనిచ్చినా వారి పిల్లలు అమెరికా పౌరులు కాలేరు.
అమెరికా వలసవాదుల్లో ఏ దేశస్తులు ఎక్కువంటే?
అమెరికాకు వలస వచ్చిన జనాభాలో 23.1 శాతం మెక్సికో దేశస్తులు ఉన్నారు. అందుకే ప్రమాణస్వీకారం రోజు ట్రంప్ మెక్సికోను అమెరికాలో విలీనం చేస్తామని అన్నారు. తర్వాత 6.1 శాతంతో ఇండియన్స్ ఉన్నారు. యూఎస్ మైగ్రెట్స్‌లో చైనా నుంచి వచ్చిన వారు 4.8 శాతం ఉన్నారు. ఫిలిప్పీన్స్ 4.4 శాతం, ఎల్ స్వాల్వడార్ 3.1 శాతం దేశస్తులు అమెరికా వలస జనాభాలో భాగమైనారు. అమెరికాలో వివిధ జాబ్స్ చేస్తున్న మైగ్రెట్స్ 2 కోట్ల 94 లక్షల 31 వేల మంది. వారిలో అత్యధికంగా నిర్మాణ రంగం, వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నారు. 1కోటి మంది పైగా ఎలాంటి పేపర్స్ లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు.
Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!
భారతీయులపై ప్రభావం..?
మాస్టర్ చేయడానికి అమెరికా వెళ్లి, పార్ట్‌టై జాబ్ చేస్తూ చదువు కంప్లీట్ చేసుకొని.. అక్కడే జాబ్ చూసుకోవాలి. పెళ్లి చేసుకొని అక్కడే సెట్టిల్ అవ్వాలని చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ కోరుకుంటారు. అందుకే ప్రతిఏటా వేలల్లో స్టూడెంట్ వీసాలపై అమెరికాకు వెళ్తున్నారు. యూఎస్ పౌరసత్వం గ్రీన్ కార్డ్ సాధించాలని వారి కల. US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం.. ప్రస్తుతం పది లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. 2024 నాటికి అమెరికా మొత్తం జనాభా 34 కోట్లు. అందులో 54 లక్షల మంది ఇండియా నుంచి అమెరికా వలస వెళ్లిన వారే ఉన్నారు.
యూఎస్ పాపులేషన్‌లో వారు 1.47 శాతం ఇండియా నుంచి వెళ్లిన వారే. ఇందులో 34శాతం మందికి మాత్రమే యూఎస్ పౌరసత్వం ఉంది. అంటే 18 లక్షల మందికి మాత్రమే అమెరికా సిటిజన్‌షిప్ ఉంది. ఇండో అమెరికన్లలో మూడింట రెండు వంతులు వలసదారులే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది.. అమెరికాకు వలస పోతున్న ఇండియన్స్ సంఖ్య ఎంతపెద్ద ఎత్తున ఉందో.. అమెరికాలో ఉన్న 36 లక్షల మంది భారతీయులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపిస్తుంది. వారికి అక్కడ పిల్లలు పుడితే అమెరికా పౌరసత్వం ఇవ్వరు.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ యుఎస్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో ఒకటైన భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ ఈ మార్పు వల్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. USలో భారతీయ వలసదారులకు జన్మించిన లక్షలాది మంది పిల్లలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా గ్రీన్ కార్డ్ కోసం ఏళ్లతరబడి వెయిట్ చేయాల్సిందే.
ట్రంప్ ఆర్డర్స్‌కు చట్టపరమైన సవాళ్లు
ట్రంప్ బర్త్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినప్పటికీ.. అది చట్టంగా మారాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. అంతేకాదు.. దీని అమలు చేయాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. US రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్(సభ), సెనేట్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత మూడు వంతుల రాష్ట్ర శాసనసభల ఆమోదించాలి. ప్రస్తుతం సెనేట్‌లో డెమొక్రాట్‌లకు 47 సీట్లు, రిపబ్లికన్‌లకు 53. సభలో డెమొక్రాట్‌లకు 215, రిపబ్లికన్లకు 220 సీట్లు వచ్చాయి.
1898లో అమెరికాలోని సుప్రీం కోర్ట్ ల్యాండ్‌మార్క్ కేసు అయిన యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ జన్మహక్కు పౌరసత్వాన్ని సమర్థించింది. ఇక్కడ USలో పౌరులు కాని తల్లిదండ్రులకు జన్మించిన బిడ్డ అమెరికానే అని తీర్పు ఇచ్చింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌కు అమలు కావటం కుదరని పని అని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. అమెరికా రాజ్యాంగంలో 14 సవరణ ద్వారా కల్పించిన బర్త్ సిటిజన్‌షిప్ రద్దు చేయాలంటే.. రాజ్యాంగ సవరణ చేయకుండా మార్చలేమని అంటున్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ 2011 ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం.. జన్మతహా పౌరసత్వాన్ని తొలగించడం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. అమెరికన్ తల్లిదండ్రులు తమ పిల్లల పౌరసత్వాన్ని నిరూపించడం కష్టమవుతుందని పేర్కొంది. ఈ పాలసీ బర్త్ టూరిజానికి అంతం చేస్తోందని నిపుణులు వాదిస్తు్న్నారు.