/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
Trump
అమెరికా బాగు కోసమే తాను అధ్యక్షుడిని అయ్యానని చెప్పారు న్యూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా పడిపోయింది ఇక చాలని...తన దేశానికి మళ్ళీ స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని ఉద్ఘాటించారు. ఈరోజు నుంచి మన దేశం అభివృద్ధి చెందుతుంది...ప్రంచ వ్యాప్తంగా మళ్ళీ తన గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది అని నిన్న వాషింగ్టన్ లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అన్నట్టుగానే రాగానే అమెండెమెంట్స్ మీద ఎడాపెడా సంతకాలు చేస్తున్నారు. మొత్తం వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేయనున్నారు కొత్త అధ్యక్షుడు. అందులో ఈ పదీ చాలా ముఖ్యమైనవి.
డబ్ల్యూహెచ్‌వో కు గుడ్‌బై..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుడ అమెరికా వైదొలిగిపోయింది. ఇక మీదట డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుచి ఎటువంటి సపోర్ట్ ఉండదు. దీని వలన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద చాలా ప్రభావం పడనుంది. ఆ సంస్థకు అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. దాంతో పాటూ డబ్ల్యూహెచ్‌వో అమలు చేస్తున్న చాలా పథకాల మీద కూడా దెబ్బ పడనుంది.
వాక్‌స్వాతంత్రం...
అమెరికాలో నిషేంలో ఉన్న వాక్ స్వాతంత్రం నిషేధాన్ని ట్రంప్ ఎత్తేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వాక్ స్వాతంత్రాన్ని ఒక సాధనంగా, హక్కుగా ఉపయోగించకుండా ఆపుతున్న ఉత్తర్వులను వెనక్కు తీసకుంటున్నామని ప్రకటించారు.
టిక్ టాక్‌కు సపోర్ట్...
అమెరికాలో బ్యాన్ చేసిన టిక్ టాక్‌కు కొత్త అధ్యక్షుడు ప్రాణం పోశారు. ఈ చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌కు ఆయన 75 రోజుల టైమ్ ఇచ్చారు. గడువులోగా అమెరికన్ నిబంధనలకు అనుగుణంగా టిక్‌టాక్‌లో మార్పులు చేయాలని చెప్పారు. అప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యా తీసుకోవద్దని ఆదేశించారు. టిక్‌టాక్ను అమెరికన్ల చేతిలో ఉండేలా చేయాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. దీనిని ఎలాన్ మస్క్ కొనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం...
రెండేళ్ళకు పైగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై వీలైనంత తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. యుద్ధం ముగింపు పలకడానికి అవసరమయ్యే చర్యలు చేపడతామని చెప్పారు.
గ్రీన్ ల్యాండ్ కావాలి..
గ్రీన్ ల్యాండ్ తమకు కావాలని ట్రంప్ అన్నారు. ఇప్పటికే ఈ దేశాన్ని అమెరికా క్రమించింది. ఇప్పుడు దాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ కూడా సమర్థించారు. గ్రీన్ ల్యాండ్‌ను అమెరికాకు ఇవ్వడం వలన డెన్మార్క్‌కే ఉపయోగం అని అంటున్నారు. గ్రీన్ ల్యాండ్ చుట్టూతా చైనా, రష్యా యుద్ధనౌకలు విస్తరించి ఉన్నాయి. దీని వలన ఆ దేశానికి అంతర్జాతీయ భద్రత లేకుండా పోయింది. పైగా గ్రీన్ ల్యాండ్‌ను నిర్వహించడానికి డెన్మార్క్ దగ్గర అంత డబ్బులేదు. అందుకే తమకు ఇచ్చేస్తే బావుంటుందని ట్రంప్ చెప్పారు.
కెనడా–మెక్సికోపై సుంకం..
మొదటి నుంచి చెబుతున్నట్టుగానే సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికోలపై సుంకాన్ని పెంచుతూ ఆర్డర్లను పాస్ చేశారు ట్రంప్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే చైనా విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణం తీసుకోలేదు.
ఒన్లీ టూ జెండర్స్..
అమెరికాలో ఇక మీదట నుంచి కేవలం రెండు జెండర్లు మాత్రమే ఉంటాయి. పురుషులు, మహిళలకు మాత్రమే అమెరికాలో సౌకర్యాలు లభిస్తాయి. దేశంలో థర్డ్ జెండర్ అనే భావనను ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో చాలా మంది లింగ మార్పిడి చేయించుకుంటున్నారు. ఎలాన్ మస్క్ కుమారుడు కూడా ఇదే పని చేశాడు. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
సిటిజెన్ షిప్ రద్దు..
సిటిజెన్ షిప్‌ను రద్దు చేశారు కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు అంటూ ఈ ఆర్డర్ పై సంతకం చేసిన ట్రంప్ చెప్పారు. వందేళ్ళుగా వస్తున్న ఈ హక్కుకు ముగింపు పలికారు ట్రంప్.
మెక్సికో సరిహద్దులో అత్యవసర పరిస్థితి...
అమెరికా సరిహద్దుకు సీల్ వేయాలని ట్రంప్ ఆర్డర్ చేశారు. సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమ చొరబాటుదారులను ఎదుర్కోవాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం!