Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి

తుర్కియేలోని కర్టల్ అనే హోటల్‌ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

New Update
Fire Accident

Fire Accident

Fire Accident: తుర్కియేలోని కర్టల్ అనే హోటల్‌ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వాళ్లని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న వాళ్లు రిసార్డు నుంచి పారిపోయేందుకు యత్నించారు. మరికొందరు ఆ హోటల్ కిటీకీల నుంచి దూకేశారు.   

Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

ప్రమాదం జరిగిన అనంతరం కర్టల్కాయ రిసార్టుకు పలువురు మంత్రులు కూడా చేరుకున్నారు. మంటలను అదుపుచేసినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున 3.27 గంటలకు కర్టల్‌ హోటల్‌లోని 12వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు అంతర్గత మంత్రి అలి యెర్లికాయ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 230 మంది ఆ హోటల్‌లో ఉన్నారని అక్కడి లోకల్ మీడియా చెప్పింది. 

Also Read: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ

మంటలు ఎలా మొదలయ్యాయి...

అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నాని హోటల్ సిబ్బంది ఒకరు తెలిపారు. మంటలను చూసి భవనం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. అలాగే తాను బయటపడ్డాక మరో 20 మంది అతిథులు హోటల్‌ నుంచి బయటకు వచ్చేందుకు సాయం చేసినట్లు పేర్కొన్నారు. హోటల్ బయట కలప ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ

Also read: భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు! వీడియో వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు