Prisoners Escape: జైలు వార్డర్పై సుత్తితో దాడిచేసి ఇద్దరు రిమాండ్ ఖైదీల పరారీ
ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయారు. ఖైదీలిద్దరూ జైలు వార్డర్పై సుత్తితో దాడిచేసి పరారీ కావడం కలకలం రేపింది. పరారైన ఖైదీల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి కాగా, మరోకరు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.