ట్రంప్ ఒత్తిడి.. చాబహర్ పోర్టు నుంచి తప్పుకోనున్న భారత్ !
ఇరాన్‌లోని చాబహర్ ఓడరేవుకు భారత్ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది.
ఇరాన్‌లోని చాబహర్ ఓడరేవుకు భారత్ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది.
ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి. ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్లో శవమై తేలింది. ఇంతకీ ఆమె జీవితంలో అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
గత కొన్నిరోజులుగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. ఇరాన్లో ఉంటున్న భారతీయ పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది.
విదేశాల్లో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కెనడాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. మృతుడు పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా (48)గా గుర్తించారు.
థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వెనెజువెలా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.