/rtv/media/media_files/2025/04/16/qXYBzCAbUXz1ld7yWztS.jpg)
Combination Drugs: కేంద్ర ప్రభుత్వం 35 రకాల ఔషదాలను బ్యాన్ చేసింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లను ఆదేశించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 35 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం NDCT రూల్స్ 2019 నిబంధనల పాటించకుండా ఈ డ్రగ్స్ తయారు చేయబడుతున్నాయని తేలింది. ఆయా మందుల తయారీదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
📢 Important Health Advisory! 📢
— The Pharmacist World (@TPhWpharmacy) April 16, 2025
The Central Government has issued a notification regarding a common drug combination: Chlorpheniramine Maleate + Phenylephrine Hydrochloride. pic.twitter.com/jzTOg3Z6xE
Also read: Viral video: కారు డిక్కీలో వేలాడిన చేయి వీడియో ఓవర్ నైట్‌లో వైరల్.. తీరా చూస్తే
వీటిలో యాంటీ-డయాబెటిక్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మరియు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ ఔషధాల (FDC) ఆమోద విధానాన్ని పరిశీలించాలని మరియు 1940 నాటి మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం రూల్స్ కచ్చితంగా పాటించాలని CDSCO ఆదేశించింది. సేఫ్టీ అండ్ క్వాలిటీ చెకింగ్ లేకుండా కొన్ని FDC ఔషధాలు లైసెన్స్ పొందాయని తెలిసింది. ఇది ప్రజారోగ్యానికి హాని కల్పించేవని డ్రగ్ కంట్రోలర్ సంస్థ వీటిని బ్యాన్ చేస్తూ ఈ ఆదేశాలను జారీ చేసింది.