Nashik Dargah : నాసిక్లో దర్గా కూల్చివేత.. 21 మంది పోలీసులకు గాయాలు!

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అనధికార సత్పీర్ బాబా దర్గా కూల్చివేత పెద్ద హింసకు దారి తీసింది. అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.

New Update
Dargah In Nashik

Dargah In Nashik

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అనధికార సత్పీర్ బాబా దర్గా కూల్చివేత పెద్ద హింసకు దారి తీసింది. అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.  ఈ క్రమంలో స్థానికులు, దర్గా ట్రస్టీలు అధికారులతో మాట్లాడుతూ ఉండగా..  కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో 21 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హింసలో ఐదు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.  పోలీసులు లాఠీచార్జ్ చేసి జనసమూహాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలీసులు కూల్చివేతలను ప్రారంభించారు.  ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హింసలో పాల్గొన్న వారిని అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగుతోందని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ అన్నారు.

Also read :  భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు