Indus Treaty: మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, మరోవైపు పాక్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది.

New Update
Pakistan requests

పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, మరోవైపు పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ చర్యతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమైంది.

Also Read :  బంగారంపై భారీగా సుంకాలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్

Pakistan Requests India To Release Indus River Waters

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అమెరికా పర్యటనలో భారత్‌పై అణుయుద్ధ బెదిరింపులు చేస్తూ, సింధూ నదిపై భారత్ నిర్మిస్తున్న ఆనకట్టలను క్షిపణులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బిలావల్ భుట్టో సైతం భారత్‌కు యుద్ధ హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఖరీఫ్ సీజన్ వస్తుడటంతో పాకిస్తాన్ రైతులకు సాగునీరు లేకుండా పోయింది. తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

సోమవారం పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక కీలక ప్రకటన చేసింది. ఇండస్ జలాల(Indus River) ఒప్పందం తక్షణమే పునరుద్ధరించాలని భారతదేశాన్ని కోరింది. ఆగస్టు 8న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదులపై భారతదేశం నిర్మించబోయే కొత్త రన్-ఆఫ్-రివర్ జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్ ప్రమాణాలను ఈ తీర్పు వివరించిందని ఇస్లామాబాద్ పేర్కొంది.

Also Read :  అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?

"ఇండస్ జలాల ఒప్పందం సాధారణ విధులను తక్షణమే పునఃప్రారంభించాలని, దాని ఒప్పంద బాధ్యతలను పూర్తిగా, విశ్వసనీయంగా నెరవేర్చాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాము" అని విదేశాంగ కార్యాలయం X లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు అనేక లేఖలు రాసింది. సింధూ నదీ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, నీటిని విడుదల చేయాలని కోరింది. అయితే, భారత్ పాకిస్తాన్ అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకునేంత వరకు ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. "నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు" అని భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పహల్గామ్ దాడి తర్వాత భారత్ "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) ను ప్రారంభించి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో భయపడిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్‌ను వేడుకుంది. అప్పటినుంచి పాకిస్తాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సింధూ జలాల నిలుపుదల పాక్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసిమ్ మునీర్, బిలావల్ భుట్టోల యుద్ధ బెదిరింపులు ఒకవైపు, నీటి కోసం పాక్ ప్రాధేయపడడం మరోవైపు చూస్తుంటే, పాకిస్తాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Indus Treaty implications | bilawal bhutto | PPP Chairman Bilawal Bhutto | latest-telugu-news | telugu-news | national news in Telugu | international news in telugu

Advertisment
తాజా కథనాలు