Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, మరోవైపు పాక్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అణు దాడి గురించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అసిమ్ మునీర్ మాటలు ఒసామా బిన్ లాడెన్ ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నాయని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేస్తామని బెదిరించాడు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ భద్రత కోసం భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని చెప్పింది.
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ 2 నెలల్లోనే రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్‌లో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
జూలై 15న ప్రధాని ఇంట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తాజా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తర్వాత ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విడిగా సమావేశమైయ్యాడు. దీంతో కొత్త అనుమాలకు తెరపైకి వస్తున్నాయి.