/rtv/media/media_files/2025/08/12/trump-deploys-national-guards-in-washington-dc-2025-08-12-11-39-11.jpg)
Trump deploys National Guards in Washington dc
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వలసవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, అనేక దేశాలపై టారిఫ్‌లు విధించడం, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించేలా ఆదేశాలివ్వడం లాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: చైనాతో వెనక్కి తగ్గిన ట్రంప్.. మరో 90 రోజులు వాణిజ్యం ఒప్పందం పొడిగింపు
మరో విషయం ఏంటంటే ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో నేరాలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. 2024లో హింసాత్మక నేరాలు 35 శాతం తగ్గాయి. అలాగే 2025 ప్రారంభంలో దోపిడీలు 25 శాతం, హత్యలు 12 శాతం తగ్గాయి. అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ సైన్యాన్ని మోహరించారు. వాస్తవానికి నేషనల్ గార్డ్స్‌ను విపత్తులు వచ్చినప్పుడు లేదా పెద్దఎత్తున అల్లర్లు జరిగినప్పుడు, జాతీయ భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో మోహరిస్తారు.
వాషింగ్టన్‌లో నేషనల్ గార్డ్స్‌ను మోహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అక్కడ నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. 2020లో జార్జీ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో తీవ్ర నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో ఈ ఆందోళనలు జరిగాయి. అప్పుడు కూడా వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రభుత్వం వందలాది మంది నేషనల్ గార్డులను మోహరించింది.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
అలాగే 2020లో నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2021 జనవరి 6న కాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగాయి. అప్పుడు కూడా భద్రత కోసం వేలాదిమంది నేషనల్ గార్డులను మోహరించారు. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య జరిగిన తర్వాత కూడా వీళ్లు రంగంలోకి దిగారు. సాధారణంగా పరిస్థితులు అదుపుతప్పినప్పుడు మాత్రమే నేషనల్ గార్డులను రంగంలోకి దింపుతారు. కానీ ఇప్పుడు వాషింగ్టన్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ వాళ్లని రంగంలోకి దింపడం చర్చనీయాంశమవుతోంది. అయితే వాషింగ్టన్ మాఫియా గ్యాంగులు, నేరస్థులు చేతుల్లోకి వెళ్తోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు నిరసనలు చేస్తున్నారు.
Trump said he was deploying 800 National Guard troops to the US capital and putting its police under federal control to combat what he said was a wave of lawlessness. Statistics show violent crime hit a 30-year low in 2024 and has continued to decline https://t.co/EDpyhTUC55pic.twitter.com/sQ3dyeaqPR
— Reuters (@Reuters) August 11, 2025
Also Read: జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధంపై కీలక అంశాలు చర్చ