/rtv/media/media_files/2025/08/12/trump-says-gold-will-not-face-tariffs-after-customs-confusion-2025-08-12-12-54-48.jpg)
Trump Says Gold Will Not Face Tariffs After Customs Confusion
Trump:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌లో కూడా టారిఫ్‌లను 50 శాతానికి పెంచారు. అయితే అమెరికాలో దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాలు విధిస్తున్నారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. బంగారంపై సంకాలు విధించబోమని తేల్చిచెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత వారం అమెరికా కస్టమ్స్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఒక కేజీ అలాగే 100 ఔన్సుల(2.8 కిలోల) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని చెప్పింది.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
ఆ తర్వాత బంగారంపై సుంకాలు విధించే విషయంలో ట్రంప్ స్పష్టత ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తారంటూ ఓ వైట్‌హౌస్ అధికారి అన్నారు. దీంతో ఈ విషయం మరింత గందరగోళానికి దారి తీశాయి. అలాగే బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలోనే దీనిపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. బంగారంపై సుంకాలు విధించబోమని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో బంగారంపై అమెరికా సుంకాలు విధించడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే బంగారం ధర ఔన్సుపై 50 డాలర్ల వరకు తగ్గింది.
ఇదిలాఉండగా స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై మాత్రం 39 శాతం సుంకం విధించాలని ఇటీవల ట్రంప్ నిర్ణయించారు. అయితే స్విట్జర్లాండ్‌తో పాటు అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారు ఉత్పత్తులకు కూడా ప్రతీకార సంకాల నుంచి మినహాయింపు ఉంటుందా ? లేదా అనే దానిపై ఆందోళన నెలకొంది. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
ఇదిలాఉండగా ప్రస్తుతం భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. చైనా విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. గతంలో ఆయన చైనాపై చేసిన టారిఫ్ వార్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరుదేశాలు ఒకదానికికొకటి టారిఫ్‌లు పెంచుకుంటూనే పోయాయి.అనంతరం ఓ వాణిజ్య ఒప్పందానికి వచ్చాయి. అమెరికా దిగుమతులపై సుంకాలను చైనా 125 నుంచి 10 శాతానికి తగ్గించగా.. చైనా దిగుమతులపై సుంకాలను అమెరికా 145 నుంచి 30 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: భారత్‌ను కవ్విస్తున్న చైనా..సరిహద్దుల వెంట కీలక ప్రాజెక్టుల నిర్మాణం
ఈ తగ్గింపు 90 రోజుల పాటు అమల్లో ఉండేలా అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఒప్పందం ఆగస్టు 12 అర్ధరాత్రి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.