/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ELON-MUSK-jpg.webp)
musk
ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం,సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగిన మస్క్ ప్రపంచ కుబేరుడిగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విమర్శలు ఎదురైనప్పటికీ లెక్కచేయని ఆయన, అమెరికా రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించే స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కొంతకాలంగా అమెరికా ప్రభుత్వంలో తన పరపతిని పెంచుకున్నప్పటికీ ..అక్కడి ప్రజల్లో మాత్రం ఇటీవల ఆదరణ కోల్పోయినట్లు తాజా సర్వే లో వెల్లడైంది.
ఫెడరల్ ప్రభుత్వం పై ఎలాన్ మస్క్ ప్రభావం పై అసోసియేటెడ్ ప్రెస్ -ఎన్‌ఓఆర్‌సీ ఓ పోల్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వయోజనుల్లో కేవలం 33 శాతం మంది మాత్రమే మస్క్‌కు మద్దతుగా మాట్లాడారు. ఫెడరల్ ప్రభుత్వంలో సంస్కరణల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత, అర్థరాత్రి ఆకస్మిక నిర్ణయాలు,కేబినెట్ సమావేశంలో మస్క్ పాల్గొనడం వంటి చర్యల పై ప్రజలుతమ అభిప్రాయాలు తెలిపారు.
గత డిసెంబర్ లో చేసిన సర్వేలో ఆయనకు 41శాతం మద్దతు లభించగా ఇప్పుడు అది చాలా శాతం తగ్గిపోయింది. ప్రభుత్వంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన డోజ్ సారథిగా ఉన్న ఎలాన్ మస్క్ ,మరికొద్ది వారాల్లోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్లు సమాచారం .అయినప్పటికీ కొన్ని నెలలుగా ప్రభుత్వం పై ఆయన ప్రభావం తీవ్రంగా ఉంటుందని మూడింట రెండు వంతుల మంది తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు..
ప్రతిష్ఠను దిగజార్చుకోవడం..
ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారని ఇందులో మస్క్ కీలక పాత్ర పోషించినట్లు అమెరికన్లలో సగం మంది అభిప్రాయ పడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎలాన్ మస్క్ ప్రజాదరణ కోల్పోవడం,ఆయన ప్రతిష్ఠను దిగజార్చుకోవడం సిగ్గుచేటు అని నార్త్ కరోలినాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు పేర్కొన్నారు.అతిపెద్ద వ్యవస్థ కలిగిన ఫెడరల్ ప్రభుత్వాన్ని మస్క్ గందరగోళం చేశారన్నారు.
మస్క్ పై విశ్వాసం లేదని, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదని చెప్పారు. ప్రైవేటు రంగంలో మస్క్ సాధించిన విజయాలు అమెరికా ప్రభుత్వానికి ఆపాదించలేమన్నారు.బిజినెస్ మాదిరిగానే ప్రభుత్వాన్ని నడపొచ్చని మస్క్ భావిస్తున్నారని ,అది సాధ్యం కాదన్నారు.ఇలా స్వతంత్రులు, డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ..రిపబ్లికన్లు మాత్రం మస్క్ చర్యలకు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తుంది.
Elon Musk | trump | doze | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates