/rtv/media/media_files/2025/08/16/jewelry-heist-2025-08-16-12-37-59.jpg)
Jewelry Heist
Jewelry Heist:
ఇటీవల హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా నగల దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. మాస్కులు ధరించిన కొంతమంది దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకులు చూపించి దోపీడీకి పాల్పడిన విషయం తెలిసిందే. అలాంటిదే అగ్రరాజ్యం అమెరికాలోనూ చోటు చేసుకుంది. అమెరికాలోని సియాటెల్ నగరంలో గల నగల దుకాణంలోనూ భారీ దోపిడీ జరిగింది. సియాటెల్ నగరంలోని ఒక నగల దుకాణంలోకి చొరబడిన దొంగలు కేవలం 2 నిమిషాల్లోనే దాదాపు 2 మిలియన్ డాలర్ల విలువైన నగలు (భారత కరెన్సీలో దాదాపు రూ.17.53కోట్లు) దోచుకెళ్లారు. కాగా దుండగులు షాపులోకి ప్రవేశించి షాపును లూటీ చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Cops are still looking for the violent streets thugs who ransacked Menashe and Sons in West Seattle, snatching watches and jewelry worth $2 million.
— Jonathan Choe (@choeshow) August 16, 2025
Meanwhile, Mayor Bruce Harrell says crime is down in the city. https://t.co/GyHlPymVDApic.twitter.com/UqlGa0UYSf
Also Read: Trump: మేం మాట్లాడుకోవడం అయిపోయింది..ఇంక అంతా జెలెన్ స్కీ చేతుల్లోనే..
వెస్ట్ సియాటెల్‌లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. షాపులో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగినట్లు సీపీ కెమెరాల్లో స్పష్టంగా అర్థమవుతోంది. మాస్క్‌లు ధరించిన నలుగురు దుండగులు షాపుకు ఉన్న గ్లాస్ డోర్‌ను బద్దలుకొట్టి లోపలికి వచ్చారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. అనంతరం డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలు, లగ్జరీ వాచ్‌లను కొళ్ల గొట్టారు.
Also Read: TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మొత్తం ఆరు డిప్‌ప్లే కేస్‌లలో ఉన్న వజ్రాభరణాలు, గడియారాలను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఈ దోపీడంతా కేవలం 90 సెకన్లలోనే పూర్తి కావడం గమనార్హం. కాగా దుండగులు షాపును దోచుకుంటున్న ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Also read : TSLPRB: తెలంగాణలో118 APP పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అనుమానితులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 2 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఈ మొత్తం మరింత ఎక్కువ ఉండొచ్చని దుకాణం యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.
Also read : Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!