Putin: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్

ట్రంప్, పుతిన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అనేక అంశాలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే ఓ రిపోర్టర్‌రు పుతిన్‌ను కాల్పుల విరమణకు అంగీకరిస్తారా ? అని ప్రశ్నించారు. దీనికి పుతిన్ లేదంటూ ట్రంప్ ముందే తల ఊపారు.

New Update
Trump, Putin

Putin and Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) అలస్కా వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అనేక అంశాలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే ఓ రిపోర్టర్‌రు పుతిన్‌ను కాల్పుల విరమణకు అంగీకరిస్తారా ? అని ప్రశ్నించారు. దీనికి పుతిన్ లేదంటూ ట్రంప్ ముందే తల ఊపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి కాల్పుల విరమణకు పుతిన్ ప్రస్తుతం అంగీకరించలేదని స్పష్టమైంది. 

Putin Hints No Ceasefire - Russia-Ukraine War

అయితే తాము జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్లు ట్రంప్ చెప్పారు. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని అంశాలు పరిష్కరించుకున్న తర్వాతే అధికారికంగా శాంతి ఒప్పందంపై సంతకం చేస్తారని తెలిపారు. మరోవైపు శాంతి చర్చల్లో పనులకు ఆటంకం కలిగించకూడదని.. ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టేలా చర్యలు తీసుకోవద్దని ట్రంప్‌.. పుతిన్‌కు చెప్పినట్లు సమాచారం. ఉక్రెయిన్, యూరోపియన్ మిత్ర దేశాలు కూడా పుతిన్‌కు ఇదే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Also Read: 2 నిమిషాల్లో 2 మిలియన్‌ డాలర్ల ఆభరణాలు చోరీ..వీడియో వైరల్‌

ట్రంప్, పుతిన్ భేటీ ఆరేడు గంటలు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ముడు గంటల్లోనే చర్చలు ముగిశాయి. పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో యుద్ధ ముగింపుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు నిర్వహించిన సమావేశం దానికి ప్రారంభం మాత్రమేనన్నారు. అయితే ఓ రిపోర్టర్ కాల్పుల విరమణ అంగీకరిస్తారా అని అడిగిన ప్రశ్నకు లేదంటూ తల ఊపడంతో ఇప్పుడే కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని స్పష్టమైంది. దీనిపై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. 

ఇక సమావేశం జరిగిన కొన్ని గంటలకు మరో కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy), అలాగే యూరోపియన్ నేతలతో ట్రంప్‌ ఫోన్‌ కాల్ ద్వారా మాట్లాడారు. సోమవారం వాషింగ్టన్‌లో జెలెన్‌స్కీ, ట్రంప్‌ సమావేశం కానున్నట్లు సమాచారం. అలస్కాలో పుతిన్‌ భేటీ తర్వాత విమానంలో తిరుగు ప్రయాణం చేస్తూ ట్రంప్‌ వాళ్లతో మాట్లాడినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.  జెలెన్‌స్కీ కూడా ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. గంటన్నరకు పైగా ట్రంప్‌తో మాట్లాడినట్లు చెప్పారు. శాంతి ఒప్పందానికి తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. పుతిన్‌తో జరిగిన మీటింగ్‌ అంశాలు తనతో పంచుకున్నట్లు తెలిపారు. మరీ త్వరలోనే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి శాంతి ఒప్పందం జరుగుతుందా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే. 

Also Read: పుతిన్ కు ఆర్య-2 సినిమా చూపించిన ట్రంప్.. అగ్రరాజ్యం బలుపు చూపెట్టిన అమెరికా.. ఈ వీడియోలు చూడండి!

Advertisment
తాజా కథనాలు