Pakistan Floods: పాకిస్తాన్లో 300 మంది మృతి.. 140కిపైగా చిన్నారులే
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.