/rtv/media/media_files/2025/04/27/dvPS8z14EZTZjNmt6xNk.jpg)
Zelensky
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని(Russia-Ukraine War) ముగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెగ ఆరాటపడుతున్నారు. దీని కోసం చర్చలను వేగవంతం చేశారు. మూడు రోజుల తేడాలోనే రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భేటీలు జరిగేలా చేశారు. ప్రస్తుతానికి అయితే ట్రంప్ అనుకొన్నవి అన్నీ జరుగుతున్నాయి. అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీ కూడా యుద్ధం ముగింపుపై సానుకూలంగా స్పందించారు. ఇద్దరూ కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరో వైపు రష్యా, ఉక్రెయిన్, అమెరికా త్రైపాక్షిక భేటీకి ఏర్పాట్లు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. తాను పుతిన్ తో కూడా మాట్లాడానని చెప్పారు. అయితే ఈ భేటీ ఎక్కడ నిర్వహించాలో ఒంగా డిసైడ్ చేయలేదని.. తొందరలోనే అది కూడా నిర్ణయం అవుతుందని చెప్పారు.
Also Read : 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
శాంతి పునరుద్ధరణ తర్వాతనే ఎన్నికలు..
దీంతో పాటూ ఉక్రెయిన్ ఎన్నికలపై జెలెన్ స్కీ(Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. యుద్ధ సమయంలో నిర్వహించలేము కాబట్టి ఇన్నాళ్ళు చేయలేదని చెప్పుకొచ్చారు. దేశంలో శాంతి వాతావరణం ఉంటేనే ప్రజాస్వామ్య, బహిరంగ, చట్టబద్ధమైన ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని జెలెన్ అన్నారు. ప్రస్తుతం మార్షల్ లా కింద నిలిపివేయబడ్డాయని చెప్పారు.
జెలెన్ స్కీ ముందున్న సవాళ్ళు..
మరోవైపు యుద్ధం ముగించాలంటే తమకు కచ్చితంగా తూర్పున ఉన్న దొనెట్ స్క్ కావాల్సిందే అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin). ఉక్రెయిన్ ఆ ప్రాంతం నుంచి పూర్తిగా వైదొలిగితేనే కాల్పులు విరమణకు అంగీకరిస్తామని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలస్కా భేటీ లో పుతిన్ ఈ కీలక డిమాండ్ ను ట్రంప్ ముందుంచారని చెబుతున్నారు. ఈ విషయం కూడా ఈరోజు ట్రంప్...జెలన్ స్కీ, యూరోపియన్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతాన్ని ఇవ్వడానికి జెలెన్ రెడీగా లేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని, రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు.
యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ, సైనిక నష్టం మరింత పెరుగుతాయని, అమెరికా సహాయం కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని జెలెన్ పై ఒత్తిడి ఉంది. ట్రంప్ మాట వినకుంటే భవిష్యత్‌లో అమెరికా నుంచి అందే ఆయుధ, ఆర్థిక సహాయ నిలిపివేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి జెలెన్స్కీ మెడపై కత్తిగా ఉంది. అటు యుద్ధం కొనసాగించలేదు. ఇటు క్రిమియాను ఒదులు కోలేడు. భూభాగాన్ని వదులుకోవడం అంటే దాదాపు యుద్ధంలో ఓడిపోయినట్లే దీంతో ఉక్రెయిన్ దీర్ఘంగా ఆలోచిస్తోంది. 2022 ఫ్రిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ పెద్ద దేశమైన రష్యాకు ధీటుగా పోరాడుతున్నా.. ఆ దేశం చాలా కోల్పోయింది. దాదాపు 3లక్షల సైన్యం ప్రాణాలు వదిలింది. బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఉక్రెయిన్ ఇంకా చాలా కోల్పోడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ట్రంప్ తో తాజా చర్చల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏం చేస్తారో చూడాలి.