Foreign Students In US: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో 4వేల మందిపై నేరారోపణల కారణంగా వీసాలు రద్దు చేశారు.

New Update
Foreign Students in US

Foreign Students in US

వలసవాదులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ట్రంప్(Donald Trump) సర్కార్ మరోసారి విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

America Cancles Visa

ఈ వీసా(Visa) ల రద్దు వెనుక ఉన్న ప్రధాన కారణాలను అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 4,000 వీసాలను విద్యార్థులు అమెరికా చట్టాలను ఉల్లంఘించారన్న కారణంతో రద్దు చేశారు. ఈ నేరాల్లో ఎక్కువగా దాడులు, డ్రక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి చిన్న చిన్న నేరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 200 నుంచి 300 వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు(Terrorists Group) మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో రద్దు చేశారు. అయితే, ఏ గ్రూపులకు మద్దతు ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై(International Students) కఠినమైన నిఘా ఉంచడానికి, వీసాలను పటిష్టంగా పరిశీలించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, పూర్తి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం వంటి చర్యలు ఈ విధానంలో భాగం. ఈ కఠిన నిబంధనల వల్ల ఎంతో మంది విద్యార్థులు, ముఖ్యంగా పాలస్తీనా హక్కులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్న వారు, ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిణామంపై అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా, లేదా చిన్నపాటి తప్పులకు కూడా వీసాలు రద్దు చేయడం సరికాదని అవి పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయాలు అమెరికాలో విద్యాభ్యాసం పట్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆసక్తిని తగ్గిస్తాయని, అమెరికా ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని విద్యా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు.

Advertisment
తాజా కథనాలు