Drones Attack On Putin | పుతిన్‌పై మళ్ళీ డ్రోన్ దాడి | Moscow | Ukraine Russia War Updates | RTV
రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతూ భారీ సంఖ్యలో ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట కుర్స్క్ ప్రాంతాలోని ఆయన హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చివేసింది.
ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు