Zelenskyy: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డ్రెస్ ఈసారి కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో టీ షర్ట్ వేసుకుని వచ్చిన జెలెన్...ఈసారి మంచి సూట్ వేసుకుని రావడమే దీనికి కారణం.  మొదటిసారి తనను అవమానించిన వారితోనే అద్బుతం అనిపించుకున్నారు.

New Update
white house

Trump-Zelen Sky

మొదటిసారి అమెరికా అధ్యక్షుడిని కలవడానికి వచ్చినప్పుడు జెలెన్ సింపుల్ గా టీ షర్ట్(T-Shirt) వేసుకుని వచ్చారు. దీనిపై కూడా యూఎస్ అధినేతలు మండిపడ్డారు. జెలెన్ డ్రెస్సింగ్ పై రిపోర్టర్లు కూడా డైరెక్ట్ గా విమర్శించారు. కన్జర్వేటివ్‌ రిపోర్టర్‌ బ్రియాన్‌ గ్లెన్‌.. మీరెందుకు సూట్‌ వేసుకోలేదు? దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని అనేకమంది అమెరికన్లు అనుకుంటున్నారు. అసలు మీకు సూట్ ఉందా లేదా అంటూ అవమానకరంగా కూడా  మాట్లాడారు. 

Also Read :  6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

సూటు, బూటులో మెరిసిన జెలెన్ స్కీ..

అయితే ఈ సారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy) మంచి బ్లేజర్ వేసుకుని, టై కట్టుకుని వచ్చారు. ఈ డ్రెస్ లో జెలెన్ మెరిసిపోయారనే చెప్పాలి. దాంతో పాటూ ఈరోజు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన సమావేశం కూడా ఆహ్లాదంగా జరిగింది. జెలెన్ తో పాటూ యూరోపియన్ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అందరూ యుద్ధ ముగింపు దిశగా చర్చలు చేశారు. ట్రంప్ కూడా జెలెన్ స్కీ అడిగి వాటికి సానుకూలంగా స్పందించారు.  భద్రతా హామీలను ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో మీటింగ్ తరువాత జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుకుంది.  జెలెన్‌స్కీ సూట్‌ అద్భుతంగా ఉందంటూ అమెరికా మీడియా ప్రతినిధులు అనగా ట్రంప్(Donald Trump) కూడా దానికి వంతపాడుతూ తానూ అదే చెప్పానని చెప్పుకొచ్చారు. 

ఇక గతంలో జెలెన్ స్కీ డ్రెస్ బాలేదంట మొహం మీదే మాట్లాడిన కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ కూడా  సూట్ మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అంటూ పొగిడారు. దీంతో ట్రంప్ వెంటనే జోక్యం చేసుకుని మీకు గుర్తుందా ఇతనే మిమ్మల్ని అవమానించింది అని జెలెన్ కు గుర్తు చేశారు. దానికి బదులుగా జెలెన్...అవును నాకు గుర్తుంది అని చెప్పి...నేను నా డ్రెస్ మార్చుకున్నా కానీ..మీరు మాత్రం అదే సూట్ లో ఉన్నారంటూ బ్రియాన్ కు రిటార్ట్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వుల్లో మునిగిపోయారు. 

Also Read: Trump-Zelensky meet: పుతిన్ సమావేశానికి హాడావుడి..నీరసంగా జెలెన్ స్కీ భేటీ..ట్రంప్ తీరు

Advertisment
తాజా కథనాలు