/rtv/media/media_files/2025/06/23/crude-oil-price-stock-2025-06-23-10-00-41.jpg)
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. ఈక్రమంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా చమురు ధరల చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7శాతం పెరిగి 79.12 డాలర్లను చేరింది. అటు యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8శాతం ఎగబాకి 75.98 డాలర్లకు చేరింది.
Also Read : గదిలో పేలిన సిలిండర్....వైరల్ గా మారిన దృశ్యాలు
Oil Prices Rises
Oil Surges as US Joins Israel-Iran War
— TRADING ECONOMICS (@tEconomics) June 23, 2025
WTI crude oil futures rose more than 2% to around $75.9 per barrel on Monday, hovering at its highest level since January, after the US launched strikes on three Iranian nuclear...
More here: https://t.co/giat1r0qjB pic.twitter.com/Z2tA6i3Faq
Also Read : ‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.7శాతం మేర తగ్గాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్ సూచీ 0.5శాతం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.6శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.1శాతం తగ్గి 3,363 డాలర్లుగా ఉంది. ఈ ప్రభావం భారత మార్కెట్ల పైనా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హర్మూజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుంది. ఈ పరిణామాలతో భారత్‌కు నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌కు వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయి.
Also Read : యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్
Also Read : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప్రక్షాళన...రంగంలోకి అగ్రనేత గణపతి
latest-telugu-news | stock-market-news | indian-stock-market | Stock Market | Stock Market Today | crude-oil-prices | oil-prices | iran israel war news | iran-israel-war