LPG Cylinder: గదిలో పేలిన సిలిండర్‌....వైరల్‌ గా మారిన దృశ్యాలు

ముంబయిలోని ఒక ఇంట్లో భయాందోళన కలిగించే ఘటన కలకలం రేపింది. ఒక మహిళ కిచెన్‌లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్‌ బిగిస్తుండగా అనుకోకుండా సిలిండర్‌ నుంచి స్టౌవ్‌కు అనుసంధానం చేసే పైపు ఊడిపోయింది. దాన్ని సరిచేసే క్రమంలో భారీ పేలుడు సంభవించింది.

New Update
Gas Leak From Cylinder

Gas Leak From Cylinder

LPG cylinder: ముంబయిలోని ఒక ఇంట్లో భయాందోళన కలిగించే ఘటన కలకలం రేపింది. ఒక మహిళ కిచెన్‌లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్‌ బిగిస్తుండగా అనుకోకుండా సిలిండర్‌ నుంచి స్టౌవ్‌కు అనుసంధానం చేసే పైపు ఊడిపోయింది. దాన్ని తిరిగి పెట్టడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.దీంతో ఆమె సిలిండర్‌ తో సహా పైపును కిచెన్‌లో నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది. పైపు నుంచి గ్యాస్‌ పెద్ద మొత్తంలో వెలువడుతుండటంతో ఆమెకు సిలిండర్‌ తీసుకురావడం సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్‌ ను  హాల్‌లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. ఇక  సిలిండర్‌ కిందపడిపోవడం, పైపు నుంచి పెద్ద ఎత్తున గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో  గ్యాస్‌ ఇళ్లంతా వ్యాపించింది. ఈ లోపు సిలిండర్‌ లోని గ్యాస్‌ అయిపోవడంతో ఇంట్లోకి వచ్చిన ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను అక్కడినుంచి తీయడానికి ప్రయత్నించింది. 

Also Read :  చైనా చీటింగ్.. పాపం ఇరాన్ ను ఇలా వదిలేసిందేంటి!?

LPG Cylinder Explodes In The Room

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

అంతలోనే కిచెన్‌ నుంచి వెలువడిన మంటలతో భారీ పేలుడు సంభవించింది. ఒక్క సారిగా భారీ మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన వారు తెరిచి ఉన్న రెండు ద్వారాల నుంచి వారిద్దరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలన్నీ రికార్డ్‌ అయ్యాయి.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకున్నట్లు పలు జాతీయ మీడియా చానల్స్ ప్రచారం చేసినప్పటికీ.. ఎక్కడ అనేది ఖచ్చిత సమాచారం మాత్రం లేదు.వీడియోలో రికార్డు అయిన సమయాన్ని బట్టి  జూన్‌ 18న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘అదృష్టవశాత్తూ ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు, కిటికీలు తెరిచి ఉండడంతో లీకైన గ్యాస్‌ బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తగ్గింది’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సిలిండర్‌ను గ్యాస్‌స్టౌవ్‌కు బిగిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు మొదలయ్యాయి.  

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

 

gas-cylinder-prices | Gas Cylinder Incident | gas-cylinder | gas-cylinder-blast | gas-stove | mumbai | gas leak incident | gas-leakage

Advertisment
Advertisment
తాజా కథనాలు