Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్‌లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్‌లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా క్రూడ్ ఆయిల్ ధరలు చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్ ఉందనే అనుమానంతో అమెరికా హైఅలర్ట్ ప్రకటించింది.