Allu Arjun : ‘శక్తిమాన్’ సినిమాలో అల్లు అర్జున్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్

అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్‌ కాంబోలో ‘శక్తిమాన్’ మూవీ వస్తుందని వార్తలు జోరుగా సాగాయి. దీనిపై దర్శకుడు స్పందించాడు. ‘శక్తిమాన్ మూవీలో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ లేరు’ అంటూ గాసిప్ వార్తలకు చెక్ పెట్టాడు.

New Update
director basil joseph clarity on allu arjun shaktimaan

director basil joseph clarity on allu arjun shaktimaan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన బన్నీ.. అదే జోష్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మరో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కు రెడీగా ఉంది. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

శక్తిమాన్‌లో బన్నీ రోల్‌పై క్లారిటీ

ఈ నేపథ్యంలో బన్నీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు జోరుగా సాగాయి. మలయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ ఓ పెద్ద సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట ప్రచారం సాగింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘శక్తిమాన్’ తరహాలో ఓ చిత్రం రాబోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

శక్తిమాన్ పాత్రతో దర్శకుడు బసిల్ జోసెఫ్ బడా బడ్జెట్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇందులో హీరోగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌‌ని తీసుకున్నట్లు వార్తలు జోరుగా సాగాయి. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ కాకుండా.. ఇందులో శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నారంటూ టాక్ నడిచింది. అవి కాస్త వైరల్‌గా మారడంతో దర్శకుడు బసిల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

వైరల్‌గా మారిన ఈ వార్తలపై బసిల్ స్పందించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. శక్తిమాన్ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు. ఆయనతోనే ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ లేరు అని గాసిప్ వార్తలకు చెక్ పెట్టాడు. త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని చెప్పాడు. 

Ranveer Singh | Allu Arjun
Advertisment
Advertisment
తాజా కథనాలు