Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్‌

ట్రంప్‌ తాజాగా తన ట్రూత్‌ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గంమని స్పష్టం చేశారు.

New Update
Trump

Trump

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని(Russia-Ukraine War) ఆపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) అలాస్కాలో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ చర్చలు సానుకూలంగా సాగాయని ఇరుదేశాధినేతలు తెలిపారు. ఈ నేపథ్యంతో ట్రంప్‌ తాజాగా తన ట్రూత్‌ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గమని స్పష్టం చేశారు.  

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మానవాళిని అంతం చేస్తుంది: గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ

Not Ceasefire Trump Says - End Ukraine War

'' అలాస్కా(Alaska) లో పుతిన్‌ నిర్వహించిన భేటీ చాలా బాగా జరిగింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy), నాటో సెక్రటరీ జనరల్, ఇతర ఐరోపా నేతలతో కూడా ఫోన్‌లో మాట్లాడాను. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న భయంకరమైన యుద్ధం ముగియాలంటే నేరుగా ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం జరగాలి. కేవలం కాల్పుల విరమణ ఒప్పందమే కాకుండా యుద్ధం ముగించేందుకు ఇదే సరైన మార్గామని నిర్ధారించాం. సోమవారం జెలెన్‌స్కీ వాషింగ్టన్‌ డీసీలో ఓవల్ ఆఫీసుకు రానున్నారు. ఇది వర్కవుట్ అయితే పుతిన్‌తో సైతం మీటింగ్‌ పెట్టేందుకు షెడ్యూల్ చేస్తాం. దీనివల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు రక్షించబడతాయని ట్రంప్ రాసుకొచ్చారు. 

Also Read: సంచలన అప్‌డేట్.. భారత్‌పై అదనపు సుంకాలు ఉండవన్న ట్రంప్ !

Also Read: కోర్టులకు అలా చేసే అధికారం లేదు.. మోదీ ప్రభుత్వం సంచలనం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్, పుతిన్ భేటీ ఆసక్తిరంగా మారింది. కాల్పుల విరమణ పుతిన్‌ ఒప్పుకుంటారా అనేది ఉత్కంఠ నెలకొంది. కానీ ఒప్పందం మాత్రం కుదరేదు. కానీ తాము జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్లు ఇరుదేశాధినేతలు పేర్కొన్నారు. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు. అన్ని విషయాలు పరిష్కరించుకున్న తర్వాత అధికారికంగా అగ్రిమెంట్‌ సంతకం చేసేదాకా ఒప్పంద కుదరదని పేర్కొన్నారు. అంతేకాదు 2022లో తాను అమెరికాకి అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేది కాదని మరోసారి వ్యాఖ్యానించారు. గతంలో కూడా ట్రంప్ ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. మొత్తానికి రష్యా--ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందం చేసుకుంటేనే యుద్ధం ముగుస్తుందని రాసుకొచ్చారు.  

Also Read: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్

ఇదిలాఉండగా మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌పై ట్రంప్‌ 25 శాతం టారిఫ్‌ విధించగా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇటీవల మరో 25 శాతం టారిఫ్‌ విధించారు. ఈ అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. తాజాగా ట్రంప్ దీనిపై కూడా స్పందించారు. తాను భారత్‌పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్‌ను విధించకపోవచ్చని వ్యాఖ్యానించారు. పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్‌ సుంకాల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు