/rtv/media/media_files/2025/05/21/kcdEtx7Cbx8vR2bWrwst.jpg)
Supreme Court
రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు ఆదేశిస్తుంటాయి. ఇటీవల ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే కోర్టులు ఇలా ఆదేశించవచ్చా అనే దానిపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇటీవల జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా వివరాలు వెల్లడించింది. అందులో బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్
కొన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకున్నట్లయితే రాజ్యంగపరంగా గందరగోళం ఏర్పడే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లు అంగీకారం చెప్పే విషయంలో సమస్యలు ఉన్నాయని.. కానీ ఇలా గడువు విధిస్తే రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థాయిని తగ్గించినట్లు అవుతుందని మోదీ సర్కార్ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య పాలనలో ఈ రెండు స్థానాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని.. వాళ్ల విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే కోర్టుల పరంగా కాకుండా రాజ్యంగపరమైన వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని సూచనలు చేసింది.
Also Read: వీధి కుక్కల వల్ల ఇన్ని లాభాలా.. అవి లేకుంటే భయంకరమైన వ్యాధులే
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదించలేదు. దీంతో అధికార పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే ఉంచుకోవడం సరైంది కాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులు రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్ఠంగా 3 నెలల్లోగా ఆమోదించాలని లేదా తిప్పి పంపిచాలని చెప్పింది. అయినప్పటికీ గవర్నర్లు బిల్లులు జాప్యం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఇది న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఆర్టికల్ 142 ప్రకారం సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది.
Also Read: కూతురును పట్టించుకోవడం లేదు..భారత పేసర్ షమీ పై భార్య సంచలన ఆరోపణలు
సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ వ్యవహారంలో గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించే నిబంధన రాజ్యాంగంలో లేదని తెలిపారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా తీర్పునిచ్చిందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గడువు విధింపుపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన కేంద్రం.. కోర్టులకు గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదని స్పష్టం చేసింది.
Also Read: పల్సర్ బైక్ కొనివ్వలేదని .. కన్నతండ్రిపైనే కొడుకు హ*త్యాయత్నం