BIG BREAKING: సంచలన అప్‌డేట్.. భారత్‌పై అదనపు సుంకాలు ఉండవన్న ట్రంప్ !

తాజాగా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్‌ను విధించకపోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అదనపు సుంకాలు విధిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌పై ట్రంప్‌ 25 శాతం టారిఫ్‌ విధించారు. అయితే రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇటీవల మరో 25 శాతం టారిఫ్‌ విధించారు. ఈ అదనపు టారిఫ్‌ ఆగస్టు 27 నుంచి అమలు కానుంది. అయితే తాజాగా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్‌ను విధించకపోవచ్చని పేర్కొన్నారు. 

రష్యా నుంచి భారత్‌ 40 శాతం చమురును కొనుగోలు చేస్తోందని.. చైనా కూడా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. ఒకవేళ రెండోసారి అదనపు సుంకాలు విధిస్తే పరిస్థితులు  దారుణంగా ఉంటాయని తెలిపారు. తాను అదనపు టారిఫ్‌లు విధించకపోవచ్చని వ్యాఖ్యానించారు.ఇటీవల భారత్‌పై అదనంగా 25 శాతం ట్రంప్‌ టారిఫ్‌ పెంచడంపై పెద్దఎత్తున దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు