/rtv/media/media_files/2025/08/16/godfather-of-ai-geoffrey-hinton-warns-ai-could-wipe-out-humanity-2025-08-16-16-17-46.jpg)
Godfather of AI Geoffrey hinton warns AI could wipe out humanity
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ఏఐ వల్ల అనేక కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. దీంతో లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐ ఐటీతో సహా దాదాపు అన్ని రంగాల్లోకి వ్యాపించింది. రాబోయే రోజుల్లో దీని వినియోగం మరింత పెరగనుందని.. దాదాపు అన్ని పనులు ఏఐ ద్వారానే జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఏఐని సరిగ్గా వినియోగించకపోతే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్
గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ కూడా తాజాగా ఏఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెవడాలోని లాస్‌వెగాస్ జరిగిన ఏఐ4 సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళిని తుడిపెట్టేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు భావోద్వేగపూరితమైన ఏఐ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మానవుల సంరక్షణ అంశంపై వాటికి అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.
Also Read: భారత్ కు బిగ్ రిలీఫ్.. సుంకాలపై కాస్త వెనక్కు తగ్గిన ట్రంప్.. కీలక ప్రకటన!
Godfather Of AI Geoffrey Hinton Warns Humanity
ఏఐ వ్యవస్థలు ప్రస్తుతానికైతే మానవుల నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పలేమన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మానవ మేదస్సును అధిగమిస్తే.. ఇది ఇతర మార్గాలు అన్వేషిస్తుందని తెలిపారు. అంతేకాదు ఇటీల ఓ వ్యక్తి రస్యాలు బయటకు చెప్పేస్తానని ఏఐ బెదిరించిన విషయాన్ని కూడా వివరించారు. అందుకోసమే ఏఐ వ్యవస్థను భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా రూపొందించడం మంచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు.
Also Read: డాగ్ లవర్స్‌కు RGV షాకింగ్ VIDEO.. దిమ్మతిరిగే కౌంటర్లు
మరోవైపు ఏఐ వల్ల ఆరోగ్య రంగంలో విస్తృత ప్రయోజనాలు పొందవచ్చని జాఫ్రీ హింటన్(Geoffrey Hinton) అన్నారు. క్యాన్సర్ చికిత్సకు, ముందస్తు రోగ నిర్ధరణ చేసేందుకు ఇంకా అనేక ఔషధాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఏఐకి మించిన సాంకేతికత AGI భవిష్యత్తులో రానుందని తెలిపారు. ఐదు నుంచి 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల మేధస్సును అధిగమిస్తుందని తెలిపారు. దీనికి పరిష్కారాలు కనిపెట్టకపోతే దాదాపు 10 నుంచి 20 శాతం మానవాళిని ఏఐ తుడిచిపెట్టేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"If we can't figure out a solution to how we can still be around when they're much smarter than us and much more powerful than us, we'll be toast."
— ControlAI (@ai_ctrl) August 14, 2025
— AI godfather Geoffrey Hinton pic.twitter.com/sOtM8KJq1r