Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్లను అధిగమించింది ఆలియా భట్.