/rtv/media/media_files/2025/04/16/UOBypz19RrWT211s5Nuo.jpg)
vida v2 offers
ఈ మధ్య కాలంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎంతో మంది వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లు అధికంగా సేల్ అవుతున్నాయి. చిన్న చిన్న పనులకు, పిల్లలను స్కూల్స్ కు డ్రాప్ చేయడానికి, ఇంట్లో కూరగాయలు తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
మరి మీరు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఒక మంచి స్కూటర్ ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ ఆఫర్లు మీకు బాగా ఉపయోగపడతాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. తన వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. దీంతో విడా వి2 ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విడా వి2 ఎలక్ట్రిక్ శ్రేణిలో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి లైట్, ప్లస్, ప్రో అనే వేరియంట్లు. ఇప్పుడు ఈ మూడు వేరియంట్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.
Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
విడా వి 2 లైట్ వేరియంట్ పై రూ.22,000 డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ స్కూటర్ రూ.74,000లకు లభిస్తుంది.
విడా వి 2 ప్లస్ వేరియంట్ పై రూ.32,000 తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత ఇది రూ.82,800లకు సొంతం చేసుకోవచ్చు.
విడా వి 2 ప్రో వేరియంట్ పై రూ.14,700 తగ్గింపు ఉంది. ఈ తగ్గింపు తర్వాత ఈ స్కూటర్ రూ.1.20 లక్షలకు అందుబాటులో ఉంది.
అయితే ఇవన్నీ న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ రాయితీలు కూడా ఉన్నాయి.
Also read : Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
vida v2 లైట్ స్పెసిఫికేషన్లు
విడా వి2 అప్ డేటెడ్ వెర్షన్ గా అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్ పై 94 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, 7 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే, కీలెస్ ఎంట్రీ, రెజెన్ బ్రేకింగ్, ఎకో, రైడ్ అనే 2 రైడింగ్ మోడ్ లు ఉంటాయి.
vida v2 ప్లస్ స్పెసిఫికేషన్లు
విడా వి2 ప్లస్ వేరియంట్ మరింత ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇందులో 3.4 కిలో వాట్ల భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 143 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్ లు ఉన్నాయి. అవి ఎకో, సిటీ, స్పోర్ట్.
vida v2 ప్రో స్పెసిఫికేషన్లు
విడా వి2 ప్రో భారీ మైలేజ్ తో రోడ్లపై పరుగులు పెడుతుంది. ఇందులో 3.9 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 165 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కి.మీ స్పీడ్ అందుకుంటుంది.
electric-scooter | offers | latest-telugu-news | telugu-news