/rtv/media/media_files/2025/03/07/COQB5rUFGGHOzm3fprsd.jpg)
Airtel Cheapest Recharge Plan
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2025 అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీమీద ఆడుతున్నాయి. టైటిల్ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కానీ గతంలో మాదిరిగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు. జియోహాట్ స్టార్ గా ఏర్పడిన తర్వాత డబ్బులు చెల్లించి మ్యాచ్‌లు చూడాల్సి వస్తుంది.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
దీంతో ప్రముఖ టెలికాం కంపెనీలు తక్కువ ధరలో సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను అందించి క్రికెట్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అధిక వాలిడిటీని కూడా అందిస్తున్నాయి. ఇప్పటికే జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు తక్కువ ధరలో జియో హాట్ స్టార్ సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను ప్రకటించాయి. తాజాగా ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు, క్రికెట్ ప్రియులకు కిక్కిచే ఆఫర్ అందించింది.
Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
కేవలం రూ. 451 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో JioHotstarకి యాక్సెస్‌ను అందించడమే కాకుండా భారీగా డేటా కూడా వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ ప్లాన్. ఇందులో ఎలాంటి కాల్స్, మెసేజ్ ప్రయోజనాలు ఉండవు. ఈ వోచర్ పొందాలంటే వినియోగదారులు యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.
Also read : Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
రూ.451 రీఛార్జ్ ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు 50GB డేటాను అందిస్తుంది. దీంతోపాటు మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగాను ఐపిఎల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ తీసుకువచ్చింది.
కాగా గతంలో కంపెనీ రూ. 100, రూ. 195 ధరలతో మరో రెండు డేటా వోచర్‌లను ప్రారంభించింది. అందులో రూ.100 ప్లాన్ 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.195 ప్లాన్ 15GB డేటా, మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఇక జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సర్వీస్ వాలిడిటీని కలిపే రీఛార్జ్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.3999, రూ.549, రూ.1029, రూ.398 ధరలకు అనేక ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది.
airtel | airtel-ott-offers | airtel-recharge-plan | airtel-new-recharge-plans | airtel-free-offers | latest-telugu-news | telugu-news | IPL 2025