USA: మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ

అమెరికా అంతా రణరంగంగా మారుతోంది. ఐదు రోజులుగా లాస్ ఏంజెలెస్ కొనసాగుతున్న ఆందోళనలు చల్లారలేదు సరికదా ఇప్పుడు ఆ సెగ మిగతా రాష్ట్రాలకూ వ్యాపించింది. ఈరోజు మరో ఐదు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి.

New Update
usa

USA Violence

లాస్ ఏంజెలెస్ లో ఆందోళనలు ఐదో రోజు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ నిరసనలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. డాలస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, షికాగో, వాషింగ్టన్ డిసిలలో ఆందోళనలు నిర్వహించారు. ఆస్టిన్ లో ప్రదర్శన కారులకు, పోలీసులకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇందులో నలుగురు అధికారులు గాయపడ్డారు. దీంతో పోలీసులు పెప్పర్ స్ప్రే బాల్స్, టాయర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఆ తరువాత ఆస్టిన్ లో ఫెడరల్ బిల్డింగ్ మొత్తం స్ప్రే పెయింట్ తో నిరసనలు తెలియజేశారు.

Also Read :  హై టెన్షన్: BRK భవన్ వద్ద భారీ బందోబస్తు

వందల మంది ప్రొటెస్ట్..

మరోవైపు డాలస్ లో కూడా వందలాది మంది ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 200 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టును చుట్టుముట్టారు. రెండు చోట్లా పోలీసులు ప్రజలను అదుపు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. ఇక యూఎస్ రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా లాస్ ఏంజెలెస్ దాడులను నిరసిస్తూ యూనియన్లు సమావేశమయ్యాయని తెలుస్తోంది. 

Also Read :  భర్త హత్యకు 20 లక్షల సుపారీ..తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్

ఇవన్నీ ఇలా ఉంటే లాస్ ఏంజెలెస్ లో ఆందోళనలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ట్రంప్ 4 వేలమంది నేషనల్ గార్డ్స్, 700 మంది మెరైన్ లను పంపించినా..నిరసనకారులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద పెద్ద షోరూంలను లూటీ చేస్తున్నారు. వాహనాలను తగులబెగుతున్నారు. స్టేట్, నేషనల్ హైవేలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు వందలమందిని అరెస్ట్ లు కూడా చేస్తున్నారు. రబ్బర్ బెల్లెట్స్, టియర్ గ్యాస్ లను ప్రయోగిస్తున్నారు. దీంతో మరికొంత మంద్రి తీవ్రగాయాలపాలవుతున్నారు. 

 

Also Read: Bihar: ఛీఛీ అసలు వాళ్ళు మనుషులేనా..కట్నంగా కిడ్నీ..ఇవ్వలేదని చావబాదిన అత్తమామలు

Also Read :  ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్ లాస్ ఏంజెలెస్ ..గతంలోనూ గొడవలు..

usa | violence | today-latest-news-in-telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు