Honey trapping : 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఆమె భారత రాయబారిగా ఉండి ఐఎస్ఐ ఏజెంట్ తో ప్రేమలో పడి దేశానికి ద్రోహం తలపెట్టింది.

New Update
Madhuri Gupta

Madhuri Gupta

Honey trapping :  అపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో భారత దేశానికి సంబంధించిన సైనిక రహస్యాలను పాకిస్థాన్‌ కు చేరా వేశారనే ఆరోపణలతో పలువురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేశాయి. అందులో హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ కూడా ఉంది.  అమె పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా ఒక మహిళ నేరం చేయడం ఇదే మొదటిసారి కాదు సరిగ్గా 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది.

 ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’ 


జ్యోతిలాగా మాధురి గుప్తా మాములు వ్యక్తి కాదు. ఆమె భారత రాయబారి. అలాంటిది ఆమె పాక్ ఏజెంట్‌గా మారి దేశద్రోహానికి పాల్పడ్డారు. విదేశాంగ శాఖలో పనిచేస్తూ, పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. అలా దేశ  రహస్య సమాచారం చేరవేశారు. ఆ తర్వాత  అరెస్ట్‌ అయ్యారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మాధురి ఇలా చేయడం  గూఢచార వ్యవస్థలో సంచలనం సృష్టించింది. 
 
ఆమె రహస్యం బయటపడిందిలా..

26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం దేశ భద్రత విషయంలో కేంద్రం మరింత నిఘా పెంచింది. భద్రత విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఉన్న గ్రేడ్-బి అధికారి ఒకరు గూఢచర్యం చేస్తున్నట్లు బయటకు వచ్చింది. దీంతో  నాటి  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ మాథూర్ అప్రమత్తమయ్యారు. నాటి సమాచారం ప్రకారం  హైకమిషన్‌లో ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం రెండో కార్యదర్శిగా పనిచేస్తున్న మాధురి గుప్తా  పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్టు గుర్తించారు. ఆమె ఉర్దూలో పాండిత్యం , సూఫీ కవిత్వం మీద ఆసక్తి కలిగి ఉండటమే ఆమె దారి తప్పడానికి కారణమైంది.. కానీ అధికారిక రహస్యాలను లీక్ చేస్తూ దేశభద్రతకు ముప్పు తలపెట్టానని గ్రహించలేకపోయింది.

ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో

ఈ క్రమంలోనే గుప్తాను అనుమానించిన ఐపీ చీఫ్ రాజీవ్ మాథూర్, RAW చీఫ్ కేసీ వర్మ, హోంసెక్రటరీ జీకే పిళ్లైకి సమాచారం అందించారు. అనుకున్నట్లుగానే గుప్తాపై రెండువారాల పాటు నిఘా పెట్టారు. ఆ సమయంలో ఆమెకు ఉద్దేశపూర్వకంగానే ఒక తప్పుడు సమాచారం అందించారు. అనుకున్నట్లుగానే ఆ  సమాచారం పాక్‌కు చేరింది. దీంతో వారి అనుమానం నిజమైంది. తర్వాత ఆమెను భూటాన్‌లో జరిగిన సార్క్ సమ్మిట్‌కు మీడియా సహకారం అందించాలనే నెపంతో ఢిల్లీకి పిలిపించారు. అలా వచ్చిన మాధురి గుప్తాను  ఏప్రిల్ 21, 2010న ఢిల్లీకి వచ్చిన మాధురిని విదేశాంగ అధికారులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 
అలా అధికార రహస్యాల చట్టం కింద 2010 ఏప్రిల్ 22నమాధురి గుప్తాను అరెస్టు చేశారు. ఆమెపై  భారత గూఢచారి అధికారుల సమాచారం లీక్‌ చేయడం,   హైకమిషన్ సిబ్బంది బయో-డేటాలు బహిర్గతం చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.  ఈ సందర్భంగా మాధురిని విచారించిన భద్రతాధికారులకు సంచలన విషయాలు తెలిశాయి. జంశేద్ అలియాస్ జిమ్ అనే 30 ఏళ్ల యువకుడితో ఆమెకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ వలపువల విసిరింది. అప్పటికి మాధురి వయసు 52 ఏళ్లు. కానీ, ఆమె కంటే వయసులో సగం చిన్నవాడైన జిన్.. మాధురిని ప్రేమగా మోసగించి, రహస్యాలను సేకరించాడు. ఈ మొత్తం వ్యవహారం అప్పటి పాకిస్థాన్ మంత్రి రెహమాన్ మాలిక్‌కి సన్నిహితుడు, ఉన్నతాధికారి అయిన ముదస్సర్ రజా రానా నడిపించినట్టు లీక్‌ అయింది. 

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

మాధురిని మొదట ఒక మహిళా జర్నలిస్ట్ ద్వారా సంప్రదించి, మౌలానా మసూద్ అజహర్ రచించిన ఓ పుస్తకాన్ని ఇచ్చిఆమెకు నమ్మకం కలిగించారు. ఇస్లామాబాద్ నివాసంలో కంప్యూటర్, బ్లాక్‌బెర్రీ ఫోన్ ద్వారా ఆ వ్యక్తులతో గుప్తా తరుచూ సంప్రదింపులు సాగించినట్టు ఆ తర్వాత పూర్తి ఆధారాలు సేకరించారు. పాక్ ఏజెంట్లు ఆమె కోసం రూపొందించిన [email protected], [email protected] అనే ఇమెయిల్ ఐడీలలో ఆమె సుమారు 73 మెయిల్స్ పంపినట్టు చార్జ్‌షీట్‌లో ఉంది. 

ఇది కూడా చదవండి: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?

ఇక్కడ మరో విషయం ఏంటంటే మాధురి ఇస్లాం స్వీకరించి జంశేద్‌ని వివాహం చేసుకోవాలనుకుందని, ఆ తర్వాత  ఇద్దరూ ఇస్తాంబుల్ వెళ్లాలని అనుకున్నట్లు కూడా తేలింది. 2012లో మాధురి గుప్తాపై అధికారికంగా కేసు నమోదు చేశాయి దర్యా్ప్తు సంస్థలు. 21 నెలలు మాధరి తిహర్‌ జైలులో గడిపిన తర్వాత బెయిలు వచ్చింది. 2018లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. అయితే, చివరకు 2021 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని భివాండిలో ఆమె చనిపోయారు.  

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు