/rtv/media/media_files/2025/05/20/bxUclOqxCpd21fuY2nWm.jpg)
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాటలతో రాజకీయాల పట్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయ ప్రచారాలకు ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఇక భవిష్యత్‌లో రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తానని మస్క్ చెప్పుకొచ్చారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలన్ మస్క్ ఈ మాట అన్నారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైయాక ఆయనకు ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
NEW: Elon Musk says he’s cutting back on political spending in the future.
— bryan metzger (@metzgov) May 20, 2025
“I think I’ve done enough.”
“I don’t currently see a reason.” pic.twitter.com/NULUyqd1Y9
భవిష్యత్తులో తాను రాజకీయాలకు చాలా తక్కువ ఖర్చు చేస్తానని అన్నారు. ఎందుకు అని అడిగితే.. తాను ఆల్‌రెడీ తగినంత ఈ రంగంలో తగినంత ఖర్చు చేశానని భావిస్తున్నానన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు మద్దతుగా మస్క్ కనీసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. మస్క్ తన సొంత ప్రచార ర్యాలీలలో కొన్నింటికి కూడా నాయకత్వం వహించాడు. 2024లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత రాజకీయ ఖర్చులను తగ్గించుకుంటానని మస్క్ చెప్పారు. గతంలో అమెరికాస్ ఫ్యూచర్‌కు మస్క్ 21 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చారు. వీటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మాటలు అన్నారు. దీంతో ట్రంప్ పార్టీకి ఫండ్ తగ్గే అవకాశాలు కలిపిస్తున్నారు.
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Elon Musk | trump | 47th us president donald trump | america president trump | attack-on-trump | donations | political | latest-telugu-news