Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

పాకిస్తాన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెగ ట్రెండ్ అవుతున్నారు. దాడికి కారణం ఆయన చేసిన ట్వీట్స్ అని తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఆపరేన్ సింధూర్ మీద చేసిన కామెంట్స్ ను అక్కడి మీడియా హైలేట్ చేస్తోంది.

New Update
Rahul Gandhi summoned

Rahul Gandhi summoned

పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతికి లాభం చేకూరిందని..ఒ కథ. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది. భారత్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ ను ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోని ట్వీట్ చేసి, ఆపరేషన్ సిందూర్‌ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయింది. దాడుల గురించి ముందే పాక్ కు సమాచారం ఇవ్వడం నేరం లాంటి ట్వీట్లు వరుసగా చేస్తూ వచ్చారు రాహుల్ గాంధీ.  

ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తోంది..

వీటన్నింటినీ పాక్ మీడియా బాగా వాడేసుకుంటోంది. రాహుల్ గాంధీ ప్రతీ వ్యాఖ్యను హైలెట్ చేస్తూ కథనాలను ప్రచురిస్తోంది అక్కడి మీడియా. పనిలో పనిగా భారత్ ను పాక్ ఓడించింది అని కూడా ప్రచారం చేసుకుంటోంది. పాక్ ఆర్మీ భారత దాడుల్లో తన ఎయిర్ బేసులు ధ్వంసం అయినా, వైమానిక రక్షణ వ్యవస్థల్ని కోల్పోయినా కూడా ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కి చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని, ముఖ్యంగా రాఫెల్‌ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. వీటికి రాహుల్ గాంధీ కామెంట్స్ ను జత చేసి తాము చెప్పిందే నిజమని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. 

మరోవైపు రాహుల్ గాంధీ పై బీజేపీ ప్రభుత్వం మండిపడుతోంది. తాము దాడి చేస్తున్నట్టు పాక్ కు సమాచారం ముందు ఇవ్వలేదని...విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పినదాన్ని రాహుల్ గంధీ తప్పుగా అర్థం చేసుకున్నారని అంటోంది. ఒక వేళ దాడుల గురించి పాకిస్తాన్‌కి ముందే తెలిసి ఉంటే, మురిడ్కే, బహవల్పూర్ వంటి ఉగ్రస్థావరాల్లో ఉగ్రవాదుల్ని ఉంచేవారా..?, ఆపరేషన్ సిందూర్‌లో 100 కన్నా ఎక్కువ ఉగ్రవాదులు మరణించే వారా..? అని పలువురు మాజీ సైనికాధికారులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు.

 today-latest-news-in-telugu | rahul-gandi

Advertisment
Advertisment