Crime : విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

ఒడిశాలోని బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ ఆటానమస్ కళాశాలలో బీఈడీ చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై తన విభాగాధిపతి సమీర్ కుమార్ సాహూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై విద్యార్థిని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

New Update
Student's suicide attempt

Student's suicide attempt

Crime: ఒడిశాలోని బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ ఆటానమస్ కళాశాలలో బీఈడీ చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై తన విభాగాధిపతి సమీర్ కుమార్ సాహూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై వివాదం కొనసాగుతుండగా 12న విద్యార్థిని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా ఈ కేసుపు జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై న్యాయమైన దర్యాప్తు జరిగేలా చూసుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి అవసరమైన అన్ని వైద్య, మానసిక సహాయాన్ని ఉచితంగా అందించాలని చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఒడిశా డీజీపీని ఆదేశించారు. అలాగే నింధితులపై తీసుకున్న చర్యల నివేదికను 3 రోజుల్లోగా కమిషన్‌కు సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Also Read: భారత్‌ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు

కాగా విద్యార్థిని తన పట్ల హెచ్‌ఓడీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని జులై 1న కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ హామీ ఇచ్చారు. కానీ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిరాశకు గురైన ఆ విద్యార్థిని కాలేజీ ఎదుట ఆందోళనకు దిగింది. అయినా న్యాయం జరగక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని జూలై 12 2025న కళాశాల ఆవరణలోని ప్రిన్సిపాల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె శరీరం 90% కాలిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన మరో విద్యార్థి శరీరం 70% కాలింది. ఇద్దరినీ భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిని, ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు

Advertisment
తాజా కథనాలు