/rtv/media/media_files/2025/11/21/india-china-2025-11-21-10-55-52.jpg)
అమెరికా(usa) అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధించిన సుంకాలు భారత్ కు మంచే చేశాయి. మన దేశాన్ని ఇబ్బందుల్లో పెట్టాలనుకున్నారు కానీ ఆయనకే దిమ్మతిరే షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్ ను విస్తృతం చేసుకుని ఎక్కడా తగ్గేదేల్యే అని భారత్ నిరూపించింది. ముఖ్యంగా భారత్-ఛైనాల మధ్య వాణిజ్యం విపరీతంగా పెరిగింది. ట్రంప్ సుంకాలు అమలు చేసిన తరువాత నుంచి చైనాకు భారత్ వస్తువుల ఎగుమతి పెరిగింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 10 బిలియన్లకు పైగా విలువైన వస్తువులను ఇండియా ఎగుమతి చేసింది.పెట్రోలియం ఉత్పత్తులు 112 శాతం, టెలికాం వస్తువులు 276 శాతం పెరిగాయి భారత ప్రభుత్వ డేటా చెబుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ లలో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది సెప్టెంబర్ లో 33 శాతం, అక్డోబర్ లో 42 పెరుగుదల కనిపించింది. చైనాలో పారిశ్రామిక చమురుకు అధిక డిమాండ్ ఉంది. దీంతో భారతీయ పెట్రోలియం ఉత్పత్తులు అక్కడ వేగంగా అమ్ముడవుతున్నాయి.
Also Read : కాప్ సదస్సులో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు..!
ఆరు నెలల్లో 10 బిలియన్ల వ్యాపారం..
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చైనాకు 10 బిలియన్ల వస్తువులు ఎగుమతి అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 25 శాతం ఎగుమతులు అధికం అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో స్పెయిన్ చాలా వేగంగా ఎదుగుతోంది. ఈ ఏడాది దాని వృద్ధి 43 శాతం నుంచి 151 శాతానికి చేరుకుంది. స్పెయిన్ తర్వాతి స్థానంలో చైనా ఉంది. గతంలో చైనా, భాతర్ వస్తువుల ఎగుమతులు ఎక్కువగా యూఎస్ కు మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే ట్రంప్ సుంకాల(trump tariffs) పేరుతో విరుచుకుపడ్డారో...రెండు దేశాలూ తమ మార్కెట్ ను విస్తరించాయి. ప్రపంచ మార్కెట్ వైపు దృష్టిని మళ్ళించాయి. స్పెయిన్, రష్యా, చైనా, జపాన్ ఇలా భరాత్ తన మార్కెట్ ను విస్తరించింది. ఫలితంగా, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు రెండింతలకు పైగా పెరిగాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, $1.48 బిలియన్ల విలువైన చమురు ఉత్పత్తులను భారత్ చైనాకు అమ్మింది. మొబైల్ విడిభాగాలు, నెట్‌వర్క్ పరికరాలు వంటి టెలికాం పరికరాలు 276% పెరిగి $778 మిలియన్లకు చేరుకున్నాయి. అలాగే భారత్ నుంచి చైనాకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కూడా బాగా పెరిగాయి. చైనాకు రొయ్యలు, చేపలు వంటి సముద్ర ఆహార ఎగుమతులు $659 మిలియన్లకు చేరుకున్నాయి.
Also Read: Kentucky Flight: కెంటకీ విమానం నుంచి ఎగిరిపడిన ఇంజిన్..సోషల్ మీడియాలో వీడియో వైరల్
Follow Us