/rtv/media/media_files/2025/11/21/cargo-flight-2025-11-21-10-26-37.jpg)
రీసెంట్ గా అమెరికాలోని కెంటకీలో విమాన ప్రమాదం(Kentucky Flight Accident) జరిగింది. ఇందులో 14 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం నుంచి ఇంజిన్ విడి పోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి విమానం ఇంజిన్ ఎగిరిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా(usa) కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం లూయిస్‌విల్లేలోనిముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న యుపిఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. ప్రమాదానికి గురైన విమానం హోనులూలుకు వెళుతోంది.
Also Read : అమెరికాకు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. ఇకనైనా ట్రంప్ దిగొస్తాడా?
Federal investigators released a preliminary report on the deadly crash of a UPS cargo plane in Louisville, Kentucky, that killed 14 people earlier this month, revealing that hardware meant to hold one of the plane's engines in place showed signs of fatigue and "overstress… pic.twitter.com/28cwEnDCKI
— Yahoo News (@YahooNews) November 20, 2025
కూలిన యూపీఎస్ కార్గో విమానం..
విమానం(cargo-flight) ఎగరడానికి ముందే దాని ఎడమ రెక్క నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. దాని తరువాత ఫ్లైట్ కిందపడిపోయి కూలిపోయింది. నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటూ, ఎగిసిన మంటలు, దట్టమైన పొగ కమ్మకున్నాయి. విమానం కొద్దిసేపు నేల నుండి లేచి రన్‌వేపైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటనం చెందింది. విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవనం పైకప్పు పూర్తిగా దెబ్బ తింది.ప్రమాద స్థలం UPS యొక్క అతిపెద్ద ఎయిర్ హబ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి రోజుకు 300 విమానాలను నడుపుతారు. గంటకు 400,000 కంటే ఎక్కువ ప్యాకేజీలను క్రమబద్ధీకరించే విశాలమైన లాజిస్టిక్స్ కేంద్రం ఇది. వేలాది మంది ఉద్యోగులు ఈ ఈ ఆఫీసులో పనిచేస్తున్నారు.
Dashcam video shows the crash of UPS Flight 2976 in Louisville, Kentucky. If you watch closely looks like the engine fell off during take off. pic.twitter.com/6amLvNFM4q
— Aviation (@xAviation) November 6, 2025
Follow Us