గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..!

కెనడాలో లారెన్స్ కాంప్‌బెల్ అనే వ్యక్తికి రూ.30 కోట్లు విలువ చేసే లాటరీ వచ్చింది. ఆ డబ్బులు అతని గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ ఆన్ మెక్కే కు ఇచ్చాడు. అవి తీసుకోని ఆమె మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో లారెన్స్ కాంప్‌బెల్ కోర్టును ఆశ్రయించాడు.

New Update
Lawrence Campbell

ఓ యువతి చేతిలో ప్రియుడు నిండా మోసపోయాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కెనడాలోని విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ కాంప్‌బెల్ 2024లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాని విలువ కెనడియన్ డాలర్లలో 5 మిలియన్ల డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు. లారెన్స్‌కు క్రిస్టల్ ఆన్ మెక్కే అనే ప్రియురాలు ఉంది. ఆమెతో సంవత్సరం పాటు కలిసి ఉంటున్నాడు. లారెన్స్ కొన్న లాటరీ టికెట్‌ విన్ అయ్యింది. దీంతో ఆ విషయం తెలిసిన మెక్కే ఆ లాటరీ డబ్బులు తీసుకొని మరో యువకుడితో జంప్ అయ్యింది. లారెన్స్‌కు బ్యాంక్ అకౌంట్ లేనందున.. గెలిచిన డబ్బును ఆమె పేరు మీద డిపాజిట్ చేయడానికి అతను ఒప్పుకున్నాడు.

మొదట్లో ఆమె అతనితో బాగానే ఉంది. లాటరీ విన్ అయిన తర్వాత నుంచి తరచూ ఆమె అతన్ని లాటరీ టికెట్ ఇవ్వమని అడిగేదట. ఆమె పుట్టిన రోజు నాడు లారెన్స్ కాంప్‌బెల్ ఈ టికెట్ ఆమెకు ఇచ్చాడు. డబ్బులు తీసుకునే టైంలో ఇద్దరూ చెక్కుతో ఫోటోలకు పోజులిచ్చారు. లాటరీ డబ్బులు ఆమె అకౌంట్లోకి పడగానే మెక్కే నెమ్మదిగా జారుకుంది. లారెన్స్ ఫోన్ కాల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది ఆమె. తర్వాతి రోజు నుంచి ఆమె కనిపించలేదు. క్రిస్టల్ ఆన్ మెక్కే మరో యువకుడితో  తిరుగుతూ కనిపించింది. లారెన్స్ కాంప్‌బెల్ మానిటోబాలోని కోర్ట్ ఆఫ్ కింగ్స్ బెంచ్‌లో మెక్కే మోసంపై పిటిషన్ దాఖలు చేశారు. 

lottery money in Canada | latest-telugu-news | telugu viral news | canada

Advertisment
Advertisment
తాజా కథనాలు