/rtv/media/media_files/2025/06/02/VmkApsxtqVjM5L2XjSWI.jpg)
B.Tech first year classes to begin by August 14, Says AICTE
కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆగస్టు 14 నాటికి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాజాగా అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.వాస్తవానికి ఇంజినీరింగ్ కళాశాలలు ప్రతీ ఏడాది పర్మిషన్ల కోసం ఏఐసీటీఈకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటాయి.
Also Read: ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
B.Tech First Year Classes By August 14
అయితే వాటికి జూన్ 30వ తేదీ నాటికి అనుమతులు ఇస్తామని AICTE క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆయా యూనివర్సిటీలు జులై 31వ తేదీ నాటికి కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని చెప్పింది. బీటెక్‌లో చేరిన స్టూడెంట్స్ తమ సీట్లు రద్దు చేసుకునేందుకు ఆగస్టు 11వ తేది తుది గడువని పేర్కొంది. వాళ్లకి మొత్తం ఫీజు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా
మరోవైపు ఈసెట్ రాసి లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ సెకండ్ ఇయర్‌కు చేరుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యార్థుల ప్రవేశాలను కూడా ఆగస్టు 14వ తేదీ నాటికి పూర్తి చేయాలని AICTE యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
Also Read: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
telugu-news | national-news | engineering | rtv-news | b-tech