/rtv/media/media_files/2026/01/08/supreme-court-2026-01-08-10-56-24.jpg)
Don't chickens, goats have lives, Supreme Court on stray dog lovers' plea
వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధికుక్క(Indian Street Dog)ల రక్షణపై ఎక్కువగా పిటిషన్‌లు రావడంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే, ఇతర జంతువుల జీవితాల సంగతేంటని కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. కోళ్లు, మేకల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు ? అవి ప్రాణాలు కావా అంటూ మండిపడింది. కుక్కలు కరుస్తాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేదాక తెలియవని పేర్కొంది. ఈ సమస్యకు చికత్స కంటే నివారణే ముఖ్యమని తెలిపింది.
Also Read: 2వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీధి కుక్క.. శాంతి యాత్రలో అలోక స్పెషాలిటీ!
Supreme Court On Stray Dog Lovers Plea
ముఖ్యంగా పాఠశాలల వద్ద, రోడ్లపై కుక్కల వల్ల పెరుగుతున్న ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్ల వద్ద ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో వీధి కుక్కలకు సంతాన నిరోధక సర్జరీలు చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయించడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు ఏర్పాటు చేయడం లాంటి పద్ధతుల వల్ల వీధి కుక్కల సమస్య తగ్గుతోందని పేర్కొన్నారు. భారత్‌లో ఈ విధానాలను సరిగ్గా పాటించడం లేదన్నారు. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పెరగడంతో కుక్కల బెడత తీవ్రతరమవుతోందని స్పష్టం చేశారు.
Also Read: ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
జంతు సంక్షేమ NGOల తరఫున హాజరైన న్యాయవాది కాలిన్ గోన్సాల్వ్స్ కూడా దీనిపై వాదించారు. దేశంలో కుక్కకాటు సంఖ్యలను ప్రభుత్వ నివేదికలు ఉన్నవాటి కంటే ఐదు రేట్లు ఎక్కువగా చూపిస్తున్నాయని ఆరోపించారు. కుక్క కాటు ఇంజెక్షన్‌ల సంఖ్యను కూడా సరిగ్గా లెక్కించడం లేదని అన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్ కేసులు లేవని తెలిపారు.
Follow Us