/rtv/media/media_files/2026/01/07/deep-state-2026-01-07-21-08-13.jpg)
తెర మీద ఉండేవారిని పాత్రధారి అని, ఆ తెరవెనుక ఉండి నడిపించే వాడిని సూత్రధారి అంటారు. సోసైటీలో ఏదైనా పెద్ద మార్పు జరిగితే.. దాని వెనుక ఓ మాస్టర్‌మైండ్ కచ్చితంగా ఉంటుంది. మనకు అర్థమైయ్యేలా ఒక్కమాటలో చెప్పాలంటే ఆడించేవారు. ఇంగ్లీష్‌లో దానికి వేరే పేరు పెట్టుకున్నారు. అదే డీప్ స్టేట్ పాలసీ. ప్రపంచ రాజకీయాల్లో 'డీప్ స్టేట్' అనే పదం ప్రస్తుతం ఓ పెను తుపానులా మారుతోంది.
రష్యా అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుండి మొన్నటి వెనిజులా స్వాధీనం వరకు, ఎన్నికైన ప్రభుత్వాల కంటే డీప్ స్టేట్ శక్తులు శక్తివంతంగా మారాయి. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే ఇండియాకు కూడా డీప్ స్టేట్ ప్రమాదం ఉందా? దీని వల్ల రాత్రికి రాత్రే ఏదైనా జరిగిపోవచ్చు. రాజ్యాలు కూలిపోవచ్చు.. రాజులు మారిపోవచ్చు. ప్రభుత్వాలను శాసించేదే 'డీప్ స్టేట్'.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి నాయకులను ఎన్నుకుంటారు. కానీ, ఆ నాయకుల వెనుక ఉండి పాలసీలను నియంత్రించే ఒక సమాంతర వ్యవస్థనే 'డీప్ స్టేట్' అంటారు. ఇది ఏ రాజ్యాంగానికి, ఏ చట్టానికి జవాబుదారీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ప్రఛ్చన్న యుద్ధ సమయంలో ఈ డీప్ స్టేట్ విపరీతంగా బలపడింది. అమెరికాలోని CIA, రష్యాలోని KGB వంటి గూఢచారి సంస్థలు తమ దేశ ప్రయోజనాల కోసం విదేశాల్లో ప్రభుత్వాలను కూల్చడం, తిరుగుబాట్లు చేయించడం వంటివి నేరుగా అప్పటి ప్రభుత్వాలకు తెలియకుండానే చేసేవి. అప్పటి నుండి నిఘా సంస్థలు, సైనిక ఉన్నతాధికారులు ఒక సూపర్ పవర్‌గా అవతరించారు.
వెనిజులా
ఇటీవల వెనిజులాలో జరిగిన రాజకీయ సంక్షోభం డీప్ స్టేట్ పనితీరుకు ఓ నిదర్శనం. అమెరికా మద్దతు ఉన్న శక్తులు అక్కడ ఆర్థిక దిగ్బంధనం విధించడం, అంతర్గత తిరుగుబాటును ప్రోత్సహించడం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి. ఇక్కడ కేవలం సైన్యం మాత్రమే కాదు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలు, మీడియా నెట్‌వర్కులు కూడా డీప్ స్టేట్‌లో భాగంగా మారి దేశాన్ని అతలాకుతలం చేశాయి.
గవర్నమెంట్ కంటే డీప్ స్టేట్ పవర్‌ఫుల్‌గా?
పాలకులు ఐదేళ్లకోసారి మారుతుంటారు, కానీ డీప్‌స్టేట్‌లోని అధికారులు, గూఢచారులు దశాబ్దాల పాటు అక్కడే ఉండి ఇన్‌ఫర్మేషన్, సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఆయుధాల డీలర్లు తమ లాభాల కోసం యుద్ధాలను లేదా అస్థిరతను సృష్టిస్తారు. ప్రజలకు ఏ సమాచారం వెళ్లాలి, ఏది వెళ్లకూడదు అనే దానిపై వీరికి పట్టు ఉంటుంది.
భారతదేశం ప్రమాదంలో ఉందా?
ప్రస్తుతం భారత రాజకీయాల్లో 'డీప్‌స్టేట్'పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో కొన్ని విదేశీ శక్తులు (అమెరికా విదేశాంగ శాఖలోని కొన్ని వర్గాలతో సహా) భారత్‌ను అస్థిరపరచాలని చూస్తున్నట్లు బీజేపీ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో భారత్ ప్రతిష్ఠను తగ్గించేలా కథనాలు రాయించడం. కుల, మతపరమైన చిచ్చు పెట్టడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవడం. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా దేశ వ్యతిరేక ప్రచారానికి నిధులు అందించడం.
భారతదేశం వంటి బలమైన ప్రజాస్వామ్య దేశాల్లో డీప్‌స్టేట్ కుట్రలను ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయితే, ప్రజల్లో అవగాహన, పారదర్శకమైన పాలన, కఠినమైన భద్రతా నిబంధనలతో మాత్రమే ఈ 'అదృశ్య శక్తుల'ను అడ్డుకోవడం సాధ్యమవుతుంది.
Follow Us