Trump Decisions: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు

ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.

New Update
usa

Trump VS Harvard

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2వ సారి ఎన్నికైనప్పటి నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలే తీసుకుంటున్నాడు. వాటిపై అనేక సార్లు కోర్టులో వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. ట్రంప్‌కు రెండు నెలల్లోనే 5 సార్లు షాక్‌ తగిలింది. అగ్రరాజ్యంలో ఆయన పాలన, నిర్ణయాలు ప్రజారంజకంగా లేవని పలువురు కోర్టులను ఆశ్రయించారు. అంతేకాదు రిపబ్లికన్ పార్టీ గెలుపుకు కృషి చేసిన ఎలన్ మస్క్‌ కూడా ఆయన నిర్ణయాలు వ్యతిరేఖిస్తున్నారు. 

Also Read :  ఇడ్లీలో బీర్... బాలయ్య సీన్ రిపీట్ ( వీడియో వైరల్)

ట్రంప్‌తో విభేధించిన ఎలన్ మస్క్

నిన్న మొన్నటి దాకా ట్రంప్ వెంట ఉండి.. ఎలక్షన్‌లో ఆయన కోసం పని చేశాడు. ఎలన్ మస్క్ ఎన్నికల ప్రచారం కోసం 288 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. రిపబ్లికన్ పార్టీకీ అత్యధిక పొలిటికల్ ఫండ్స్ ఇచ్చిన వారిలో ఎలన్ మస్క్ ఫస్ట్  ప్లేస్‌లో ఉంటాడు. ట్రంప్ ప్రతిపాదించిన రిపబ్లికన్ ప్యాక్స్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకించాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్‌ Xలో పోస్టు పెట్టారు. అందులో సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్‌ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బయటపెట్టలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ట్రంప్ గురించి షాకింగ్ విషయాలు బయటకొస్తాయని మస్క్ అన్నారు.

Also Read :  గుడ్లు ఉడకపెట్టెటప్పుడు తరచుగా ఈ తప్పులు చేయకండి? సరైన మార్గం తెలుసుకోండి

హార్వర్డ్ యూనివర్సిటీపై

ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్‌ చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత విధించింది ట్రంప్‌ సర్కార్‌. ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్‌ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్‌ బరోస్‌.. ట్రంప్‌ సర్కార్‌పై మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. హార్వర్డ్‌పై ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్‌ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. 

Also Read :  మీకు కడుపు నొప్పిగా ఉంటే.. జీలకర్ర సోంపును ఇలా తినండి!

ట్రంప్ వాణిజ్య సుంకాలు వ్యతిరేకించిన కోర్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక వాణిజ్య చర్యలు చట్టబద్ధతను కోల్పోయినట్టు ఫెడరల్ కోర్టు తేల్చింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఒకమాటగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో, ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి స్వతంత్ర అధికారం లేదని పేర్కొంది. అంతేకాక, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకునే సుంకాల నిర్ణయాలు తప్పకుండా కాంగ్రెస్ ఆధీనంలో ఉండాల్సినవే అని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలన సమయంలో, విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపేలా ఈ చర్యలు సాగాయి. అయితే, ఇవి అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవన్న అభిప్రాయంతో వివిధ వాణిజ్య సంస్థలు, వాణిజ్య వేత్తలు కోర్టును ఆశ్రయించారు. వారి వాదనల ఆధారంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు, అధ్యక్షునికి నిరంకుశ అధికారాలు లేవని, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో శాసనసభ పాత్ర ముఖ్యమని తేల్చి చెప్పారు.ఈ తీర్పుతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అయినప్పటికీ, ఈ తీర్పును నిలుపుదల చేయాలని ట్రంప్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read :  ఏపీలో తీవ్రవిషాదం. .ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు

ట్రంప్ వలసవిధానంపై ఆగ్రహం..

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టులో వాటిని నిలిపివేసింది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్‌ జడ్జి జాన్‌ సి. కఫెనర్‌ నిలిపివేశారు. ట్రంప్‌ ఉత్తర్వులు అమల్లోకిరాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తున్నా.. ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధమని కేసు విచారణ సందర్భంగా జడ్జి కఫెన్‌ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయీస్, ఒరేగాన్‌ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు. 

america | america 47th president | trump | donald trump news | donald trump oath ceremony | donald trump tariffs | Elon Musk | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు