నందమూరి బాలయ్య ఈనెల 10న 65వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం బాలయ్య మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లక్ష్మీ నరసింహా' చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ సూపర్ హిట్ ఫిల్మ్ మరో సారి రీరిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ మూవీ సీన్లు, సాంగ్స్ రిక్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు. తెరపై వింటేజ్ బాలయ్య వైబ్స్ ఆస్వాదిస్తూ చిల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో చూస్తూ ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.\
Also Read : ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు
Enjoying vintage bala Vibes 🕺💥#LakshmiNarasimha4Kpic.twitter.com/utQgXa128t
— Kunchanapalli._.Sai (@saikumar_1832) June 7, 2025
Also Read : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త హోం మంత్రి ఎవరో తెలుసా?
ఇడ్లీలో బీర్ సీన్
అయితే ఓ అభిమాని సినిమాలో బాలయ్య ఇడ్లీలో బీర్ కలిపి తినే సీన్ ని రిక్రియెట్ చేశాడు. అచ్చం బాలయ్య మాదిరిగా ఇడ్లీలో బీర్ కలుపుకొని తిన్న వీడియోను ఎక్స్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొంతమంది అభిమానులు ఈ సినిమాలోని పాటలను రిక్రియెట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
All set for Bala babai movie 🍾 #LakshmiNarasimha4K#HappyBirthdayNBKpic.twitter.com/Fw3Jd3FI7j
— Kunchanapalli._.Sai (@saikumar_1832) June 7, 2025
Also Read : రూ. లక్ష పొందే కొత్త స్కీమ్.. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇదిలా ఉంటే బాలయ్య పుట్టినరోజు స్పెషల్ గా ఈరోజు మరో సర్ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఒక సింహం మొహాన్ని సగం కవచంతో కప్పబడి.. సగం బయటకు చూపిస్తూ ఉంది. దీంతో ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా శక్తివంతంగా, డెప్త్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' చిత్రాన్ని కూడా ఈయనే నిర్మిస్తుండడం విశేషం.
Also Read:Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు
Lakshmi Narasimha re release | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu