Bangladesh: బంగ్లాదేశ్ లో దారుణం.. హిందూ నేతను కిడ్నాప్ చంపేసిన దుండగులు!

బంగ్లాదేశ్‌ లో ఘోరం చోటుచేసుకుంది. హిందూ నేత బాబేశ్ చంద్రను ముష్కరులు కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు ఆయనను ఇంటి వద్ద నుంచే కిడ్నాప్‌ చేసి తీసుకుని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

New Update
Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్

హిందువులు, మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నానాటికీ అక్కడి పరిస్థితి దిగజారుతోంది. తాజాగా బంగ్లాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఒక హిందూ నేతను కిడ్నాప్ చేసిన ముష్కరులు  కొట్టి చంపేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. 

Also Read: Hyderabad: బిల్డింగ్‌ పై నుంచి కూలీన భారీ క్రేన్‌...పలు వాహనాలు ధ్వంసం!

బాబేశ్ చంద్ర అనే వ్యక్తికి బంగ్లాదేశ్ లోని హిందూ సమాజంలో మంచి పేరుంఇ. బంగ్లాదేశ్ పూజా ఉద్జపన్ పరిషత్ కు చెందిన బిరాల్ యూనిట్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దినాజ్ పూర్ లో ఉంటున్న ఆయనను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఆయనను హత్య చేశారనే విషయాన్ని స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 

Also Read: Canada: కెనడాలో కాల్పులు..భారతీయ విద్యార్థిని మృతి!

Babesh Chandra Kidnap And Murder

బంగ్లాదేశ్ లోని ప్రముఖ దినపత్రిక తో చంద్ర భార్య శాంతన మాట్లాడుతూ... గురువారం  రెండు బైకులపై నలుగురు వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి తన భర్తను కొట్టి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని తెలిపారు. చంద్రను నారాబరి గ్రామానికి తీసుకెళ్లినట్లుగా కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అక్కడే చంద్రను అత్యంత దారుణంగా హింసించారు. 

ఆ మరుసటి రోజు చలనం లేని చంద్ర శరీరాన్ని ముష్కరులు ఆయన ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు. స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ... ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు. కేసు నమోదు చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

Also Read: Earth Quake: అస్సాంలో భూకంపం..భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Also Read: Telangana rain alert: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

bangladesh | bangladesh attack on hindus | murder | hindu | anti-hindu | attack on hindus | Attack On Hindu Temple In Bangladesh | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
తాజా కథనాలు