Bolivia: బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం

బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

New Update
bolivia

Bolivia Accident

బొలీవియా (Bolivia) లో వరుస ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ పోటోసికి 90 కి.మీ దూరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సు, ట్రక్ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రక్ డ్రైవర్ వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also Read :  ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు

Also Read :  మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ !

రెండు రోజుల క్రితమే ప్రమాదం..

రెండు రోజుల క్రితమే ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. డ్రైవర్లలో ఒకరు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని, మరొకరి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీస్ కమాండర్ విల్సన్ ఫ్లోర్స్ తెలిపారు. ఇద్దరు డ్రైవర్లపై నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షల ఫలితాల కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు. గాయపడిన వారిని ఒరురో, పోటోసిలోని ఆసుపత్రులకు తరలించారు. 

Also Read :  రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

Also Read: USA: 25శాతం టారీఫ్ లను కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటన..క్రాష్ అయిన స్టాక్ మార్కెట్స్..

Advertisment
తాజా కథనాలు