/rtv/media/media_files/2025/03/04/QKSkvYAIqWQtSkcBjInD.jpg)
అస్సాం (Assam) మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత (Prafulla Kumar Mahanta) కుమార్తె తన కారు డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్లిప్‌లో సదరు వ్యక్తి ఆమె కాళ్లపై మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె తీవ్రస్థాయిలో మండిపడుతూ చెప్పుతో కొట్టిన్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ సంఘటన డిస్పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్టు హౌస్ లోపల జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై మాజీ సీఎం కూతురు స్పందించారు.
Also Read : విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ
A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.
— India Today NE (@IndiaTodayNE) March 3, 2025
The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV
Also Read : బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం
మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించి
మద్యం మత్తులో అతను తనను అసభ్యకరమైన మాటలతో తిట్టాడని ఆమె ఆరోపించింది. తమ ఇంట్లో పనిచేసే ఆ డ్రైవర్ తరచుగా మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది. అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగినా లేక ప్రైవేట్‌గా నియమించబడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెళ్లలేదని ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమెకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఇలాంటి సందర్భాలలో మహిళపైనే నిందలు వేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!
వరుసగా రెండు సార్లు సీఎం
కాగా ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు - 1985 నుండి 1990 వరకు మొదటిసారి.. తిరిగి 1996, 2001 మధ్య రెండోసారి సీఎంగా పనిచేశారు. 2005 సెప్టెంబర్ 15న అస్సాం గణ పరిషత్ (ప్రగతిశీల) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అస్సాం శాసనసభలో నౌగాంగ్ నియోజకవర్గానికి 1985 నుండి 1991 వరకు ప్రాతినిధ్యం వహించారు. బెర్హంపూర్ నియోజకవర్గానికి 1991 నుండి 2021 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 1991 నుండి 1996 వరకు అస్సాం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. తిరిగి ఆయన 2010 నుండి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగాఉన్నారు.
Also read : Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?