Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.